యాప్నగరం

Jabardasth Varsha: ఇమ్మానుయేల్ కాదంటే.. నా ఊపిరి ఉండదు: జబర్దస్త్ వర్ష ఎమోషనల్

జబర్దస్త్‌ (Jabardasth) షోలో ఇమ్మానుయేల్‌పై మరోసారి తన ప్రేమను బయటపెట్టింది వర్ష. అతను కాదన్న రోజు తన ఊపిరి ఆగిపోతుందంటూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పింది.

Authored byAshok Krindinti | Samayam Telugu 11 Aug 2022, 7:14 am
Samayam Telugu varsha express love on emmanuel in extra jabardasth latest promo
Jabardasth Varsha: ఇమ్మానుయేల్ కాదంటే.. నా ఊపిరి ఉండదు: జబర్దస్త్ వర్ష ఎమోషనల్
జబర్దస్త్‌ (Jabardasth) షోకు రేటింగ్‌కు లవ్ ట్రాక్‌లు కీ పాయింట్‌గా మారిపోయాయి. ఈ షో నుంచి స్టార్ కమెడియన్స్ వెళ్లిపోయిన తరువాత మళ్లీ లవ్ ట్రాక్‌లను తెరపైకి తీసుకువచ్చి.. రేటింగ్స్ కోసం నిర్వాహకులు స్టంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ప్రోమో చూస్తుంటే అలానే అర్థమవుతోంది. ఈ షోలో రష్మీ-సుధీర్ (Rashmi Sudheer) జంట తరువాత బాగా ఫేమస్ అయిన జంట ఇమ్మానుయేల్-వర్ష (Emmanuel Varsha). వీరిద్దరిపై లవ్ ట్రాక్‌ నడుస్తోందని బుల్లితెరపై ఎప్పటి నుంచో హైలెట్ చేస్తున్నారు. సమయం వచ్చినప్పుడుల్లా ఒకరిపై ఒకరికి అమితమైన ప్రేమ ఉన్నట్లు స్క్రీన్‌పై చూపిస్తున్నారు. మొదట్లో ఇద్దరి మధ్య నిజంగా లవ్ ఉందేమో అన్నంతగా కెమిస్ట్రీని వర్క్ అవుట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ రావడంతో ఈ జోడికి కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇద్దరు స్కిట్లు చేస్తున్నా.. ఆన్ స్క్రీన్ రొమాంటిక్ డైలాగ్స్ చెప్పుకోలేదు. దీంతో జబర్దస్త్ షోలో వీరిద్దరి లవ్ ట్రాక్‌కు బ్రేకులు పడ్డాయా..? అనే రూమర్లు కూడా స్ప్రెడ్ అయ్యాయి. అయితే రూమర్లకు చెక్ పెడుతూ.. మరోసారి ఈ జంట రెచ్చిపోయింది. తన ప్రేమ నిజమేనంటూ వర్ష స్టేజ్‌పైనే ఒప్పుకుంది.


హైదరాబాద్‌లో గుంతల రోడ్డుపై సెటైర్

ఉప్పెనలోని 'జల జల జలపాతం నువ్వు..' అంటూ సాగే సాంగ్‌కు యాంకర్ రష్మీ, నరేష్ డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌లో వర్షాలు కురిస్తే రోడ్లపై గుంతలు ఎలా ఉంటాయి..? మ్యాన్ హోల్స్ తెరుచుకోవడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో కెవ్వు కార్తీక్ సైటరికల్‌గా చూపించినట్లు తెలుస్తోంది. ఈ మ్యాన్ హోల్ స్కిట్ నవ్వులు పూయించింది. 'లాలా గూడ అంబర్‌పేట..' అంటూ డీజే టిల్లు సాంగ్ పాడుతూ.. నరేష్ దొరికిపోయాడు. గ్రూప్‌లో అయితే కవర్ చేసుకునేవాడినని.. సింగిల్‌గా అయితే దొరికిపోయానంటూ అందరినీ నవ్వించాడు.

ఎంతకు తెగించావు రా..

ఆ తరువాత రాకింగ్ రాకేష్ స్కిట్ కూడా నవ్వులు తెప్పించింది. రాకేష్, సుజాత లవ్ ట్రాక్ కూడా బాగా సెట్ అయింది. తరువాత బుల్లెట్ భాస్కర్ ఎపిసోడ్‌గా బాగా వర్క్ అవుట్ అయినట్లు తెలుస్తోంది. 'నువ్వు బిజీగా ఉన్నప్పుడు.. వేరే ఆమెతో ఉంటా..' అని స్కిట్‌లో రోహిణితో బుల్లెట్ భాస్కర్ చెప్పగా.. 'ఎంతకు తెగించావు రా.. బయట అదే పని.. స్కిట్‌లో అదే పని..' అంటూ రోహిణి కౌంటర్ ఇచ్చింది. వెంటనే భాస్కర్ చెప్పొందంటూ సిగ్నల్ ఇచ్చాడు. ఈ డైలాగ్ అయితే సూపర్ అని చెప్పొచ్చు.

యముడి గెటప్‌లో గెటప్ శ్రీను

ఆ తరువాత ఎపిసోడ్‌కే హైలెట్ నిలిచేలా గెటప్ శ్రీను యముడి గెటప్‌లో వచ్చాడు. కైకాల సత్య నారాయణను అనుకరిస్తూ.. సూపర్‌గా డైలాగ్స్ చెప్పాడు. ప్రేమ జంటలను శిక్షించే లైన్ తీసుకుని స్కిట్ చేశాడు. ముందుగా రాకింగ్ రాకేష్, సుజాత జంట గురించి చెప్పారు. సన్నీ గురించి వేసిన పంచ్ డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ఇక తరువాత అసలు కథ మొదలైంది. ఇమ్మానుయేల్, వర్ష జంటను గురించి చెప్పారు.

రెచ్చిపోయిన వర్ష

ఇది చాలా డేంజరస్ కపుల్ అంటూ వారిద్దరిని ఆటో రాంప్రసాద్ పరిచయం చేశాడు. చూస్తేనే అర్థమవుతుందని గెటప్ శ్రీను అన్నాడు. మీది నిజమైన ప్రేమ అని ప్రూవ్ చేసుకుంటే పంపించేస్తామని చెప్పగా.. వర్ష ప్రేమ డైలాగ్స్‌తో రెచ్చిపోయింది. 'ఇమ్మూ.. అందరికీ డౌట్ ఉంది. అసలు ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా..? లేదా..? అని. కానీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే.. ఇమ్మూ కాదన్న రోజూ.. ఈ వర్ష ఊపిరి ఉండదు..' తన ప్రేమను మరోసారి బయటపెట్టింది. దీంతో ఇమ్మానుయేల్ ఆనందంతో ఊగిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. టీఆర్పీ స్టంటింగ్ కోసమే అయినా.. బాగా నవ్వులు పూయిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.