యాప్నగరం

Guppedantha Manasu సెప్టెంబర్ 11 ఎపిసోడ్: కాకి ఎంగిలి, కలత నిద్ర.. రిషి గుండెల్లో గుబులు

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 సెప్టెంబర్ 11)న 240 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu September 11 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 11 Sep 2021, 10:22 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 సెప్టెంబర్ 11)న 240 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ సెప్టెంబర్ 11 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu September 11 episode


240వ ఎపిసోడ్‌ హైలైట్స్..
రిషి, వసు సర్వేకి వెళ్లిన సంగతి తెలిసిందే. స్లమ్ ఏరియాలో ఉండే వారి కష్టాలు తెలుసుకుని సాయపడేందుకు రిషి, వసు ఓ చోట కారు పెట్టి.. నడుస్తూ వెళ్తుంటారు. అయితే దారిపొడవునా నీళ్లు, మట్టి ఉండటంతో రిషి నడవడానికి ఇబ్బంది పడతాడు. వసు అయితే చక్కగా నడిచేస్తుంది కానీ రిషి తూలిపడబోతాడు. వసు పట్టుకుంటుంది. దాంతో రిషి థాంక్స్ చెబుతాడు. మరోవైపు జగతిని కలిసిన మహేంద్ర.. వసు రిషిల గురించి మాట్లాడుకోవడంతో పాటు ధరణి దేవయాని ముందు బుక్ అయిన సంగతి కూడా చెబుతాడు. దాంతో పాపం ధరణి.. చిన్న సంతోషాలను కూడా మిస్ అవుతుంది.. ధరణిని కాపాడేది రిషినే.. రిషినే వదినగారిని మార్చగలడు’ అంటాడు.

ఇక వసు రిషితో ఇంకొంచెం దూరం ఇంకొంచెం దూరం అంటూ నడిపిస్తూనే ఉంటుంది. ‘ఇక నావల్ల కాదు.. ఏదొకటి ఏర్పాటు చెయ్ వెళ్లడానికి అంటాడు. అయితే వసు వెంటనే.. ‘సైకిల్ ఓకేనా సార్’ అంటే.. గతంలో తను ఊహించుకున్నది గుర్తు చేసుకుని ఒక్కసారిగా నో అంటాడు. వెంటనే అక్కడ తెలిసిన వాలింటీర్‌కి కాల్ చేసి బైక్ తెప్పిస్తుంది. దానిపైన ఇద్దరూ వెళ్తుంటే.. వసుధర గట్టిగా పట్టుకో.. లేదంటే పడిపోతావ్ అనడంతో.. వసు రిషిని పట్టుకునే సమయంలో.. గతంలో రిషిని కలిసిన మాట్లాడిన సందర్భాలు తలుచుకుంటుంది. ‘ఇంత తక్కువ సమయంలో రిషి సార్‌తో ఎన్ని జ్ఞాపకాలు అనుకుంటూ మురిసిపోతుంది. ఆ చల్లగాలికి వసు రిషిపై వాలి నిద్రపోతుంది. రిషికి అర్థమవుతుంది. ఇక మిస్టర్ ఇగో ఒకచోట బండి ఆపి.. ఇంకెంత దూరం అనడంతో వసు లేచి.. వెళ్లాల్సిన దారి చూపిస్తుంది. అయితే వసు రిషిపై వాలి నిద్రపోయే సీన్ మాత్రం చాలా రోమాంటిక్‌గా చూపించారు.

ఇక వెళ్లాల్సిన ఊరు చేరుకున్నాక ఒక వ్యక్తి ఎదురొచ్చి మర్యాదగా కమ్యునిటీ హాల్‌కి తీసుకుని వెళ్తాడు. అక్కడ రిషికి కుర్చీ వేస్తే.. ఆ కుర్చీకి మురికి ఉంటుంది. వసు వెంటనే చున్నీతో తుడుస్తుంది. ‘సార్ ఇంతమంది ముందు మీరు దుమ్ములో కూర్చోవడం బాగోదు సార్ అంటుంది. దాంతో రిషి గుండెల్లో గుబులు మొదలవుతుంది. వసుని అలానే చూస్తూ ఉండిపోతాడు. ఇక కమింగ్ అప్‌లో ఉన్న ఒక చాక్లెట్‌ని.. రెండు ముక్కలు చెయ్యలేక రిషి ఇబ్బంది పడుతుంటే.. వసు రిషి దగ్గర కర్ఛీప్ ఉందా అంటుంది. రిషి ఇవ్వగానే.. అందులో చాక్లెట్ ఉంచి కొరికి ముక్కలు చెయ్యబోతుంటే.. ‘ఏం చేస్తున్నావ్’ అంటాడు రిషి. ‘కాకి ఎంగిలి సార్’ అంటూ రెండు ముక్కలు చేసి ఒకటి రిషికి ఇస్తుంది. మొత్తానికి రిషి కర్ఛీప్ వసు నోట్లో పెట్టుకుని ఎంగిలి చేసింది. మరి దాన్ని మన ఇగో మాస్టర్ ఎవరు లేనప్పుడు చూసుకుని మురిసిపోతాడేమో. చూడాలి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.