యాప్నగరం

Gruhalakshmi మార్చి 11 ఎపిసోడ్: కొత్త ఇంట్లో శ్రుతి, ప్రేమ్ రొమాన్స్.. తులసికి చుక్కలు చూపిస్తున్న దివ్య

అన్న కోసం పంతం పట్టింది చెల్లెలు దివ్య. అకారణంగా అన్న ప్రేమ్‌ని ఇంట్లో నుంచి నెట్టేయడంతో తల్లి తులసిపై పగపట్టింది దివ్య. తిండితినకుండా దీక్ష చేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది.

Samayam Telugu 11 Mar 2022, 3:46 pm
ప్రేమ్‌ని ఇంట్లో నుంచి పంపేయడంతో దివ్య.. తులసిపై కోపాన్ని పెంచుకుంది. అన్నయ్య వచ్చేవరకూ తిండి తిననని దీక్షపూనింది. తులసి తినిపించడానికి ప్రయత్నించగా.. భోజనం ప్లేట్‌‌ని నేలకేసి కొట్టింది దివ్య. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. తల్లిప్రేమను దివ్య అర్ధం చేసుకోలేకపోతుంది.. ఆమెకు నువ్వైనా సర్ధిచెప్పు అని అంకిత మందు ప్రాధేయ పడుతుంది తులసి. సరేనన్న అంకిత.. మీరు ప్రేమ్ విషయంలో తీసుకున్న నిర్ణయం మాకు నచ్చలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
Samayam Telugu ఇంటింటి గృహలక్ష్మి photo courtesy star maa and hotstar
Intinti Gruhalakshmi 2022 March 11 Episode


దీంతో తులసి.. దేన్ని ఎప్పుడు వదలుకోవాలో తెలుసుకోవడమే వైరాగ్యం.. ఇప్పుడు నేను అదే పరిస్థితిలో ఉన్నాను.. ప్రశాంతంగా ఉండటం కోసం భర్తని వదులుకున్నాను.. జీవితం బాగుండాలని ప్రేమ్‌ని వదులుకున్నాను.. రేపటి రోజున దివ్య పరిస్థితి ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శశికళ నుంచి ఫోన్ వస్తుంది.. డబ్బులు రెడీ చేస్తున్నావ్ కదా.. నీకు ఇచ్చిన గడువు దగ్గరపడుతుందని గుర్తు చేస్తున్నా.. ఎందుకంటే నీ ఇల్లు అమ్మకానికి పెట్టాలి కదా అని అంటుంది. మీరు ఆ ప్రయత్నాలు మానుకుంటే నేనే నా ప్రయత్నంలో ఉంటా అని అంటుంది తులసి.

ఇంతలో వదినా అంటూ సీన్‌లోకి వస్తుంది మాధవి. పెద్ద తప్పు చేశావ్ వదినా.. ఇంత కఠిన నిర్ణయం తీసుకుంటావ్ అని అనుకోలేదు.. ప్రేమ్ అన్నయ్యని ఏదో అన్నాడని ఇంటిని ముక్కలు చేస్తావా? అని అడుగుతుంది.

నా గుండె కూడా ముక్కలు అయ్యింది.. నువ్వు కూడా అందరిలాగే ఆలోచిస్తున్నావా? కాలు తీయకపోతే మనిషి చనిపోతాడు అనుకున్నప్పుడు కాలు కోసం ఆలోచించను.. ప్రాణం కోసమే ఆలోచిస్తా

అంకిత దివ్య దగ్గరకు వెళ్లి నచ్చజెప్పడానికి ట్రై చేసినా.. దివ్య వినిపించుకోదు.. ఈ ఇంట్లో ప్రేమలు, బంధాలు లేవు.. ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతా. మాట్లాడితే మా మంచికే అంటుంది.. ఇంటికి నిప్పు పెడితే మంచికే అంటే నేను నమ్మాలా? నేను నా పంతం వీడితే అమ్మ ప్రేమ్ అన్నయ్యకోసం ఆలోచించదు.. ప్రేమ్ అన్నయ్య ఇంటికి వస్తేనే తింటానంటూ కుప్పకూలి పడిపోతుంది దివ్య.

దీంతో అంకిత పెద్దగా అరుస్తూ.. దివ్యని పరీక్షిస్తుంది. తినకపోవడం వల్లే ఇలా అయ్యింది.. చాలా వీక్‌గా ఉంది.. ఆహారం తినకపోతే ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది అని చెప్తుంది అంకిత.

దీంతో మాధవి. తప్పమ్మా అలా చేయకూడదు అని చెప్పడంతో.. ఆ మాట నాకు కాదు అత్తయ్యా.. అమ్మకి చెప్పండి.. అమ్మ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా నేను కాదనలేదని అంటుంది దివ్య. దీంతో మాధవి.. మీ అమ్మ ఎప్పుడూ నీ సంతోషమే కోరుకుంటుంది.. ప్రేమ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది అంటే.. అది మీ మంచికే అని అనుకోవచ్చుగా అని అంటుంది మాధవి. అన్నా చెల్లెల్ని విడదీసి మంచికే అంటే ఎలా అత్తయ్యా.. అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని మీరంతా సపోర్ట్ చేస్తున్నారా? ఈ ఇంట్లో ఎవరూ అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించరు.. అయినా.. అమ్మ మాత్రం పంతం వీడటం లేదు.. అమ్మకి ఉన్న పంతమే నాకూ ఉంది.. అందరూ నా దగ్గర నుంచి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తుంది దివ్య. దీంతో తులసి ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అనంతరం.. బయటకు వెళ్లిన తులసి.. గుండెలు బాదుకుంటూ ఏడ్చేస్తుంది..

కొత్త ఇంట్లో ప్రేమ్-శ్రుతి.. రొమాన్స్
కొత్త ఇంట్లో కొత్త జీవితం మొదలుపెట్టిన ప్రేమ్, శ్రుతిలు.. రొమాంటిక్ సాంగ్ పెట్టుకుని ఇంటిని బాగు చేసుకుంటూ ఉంటారు. పనిలో పనిగా శ్రుతితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు ప్రేమ్. వీళ్ల సరసాలు మామూలుగా ఉండవు. మొత్తానికైతే బాధను మరిచిపోయి సంతోషంగా ఉంటారు. ఆ తరువాత ఇంటిని డెకరేట్ చేయడం ఎలా అన్నదానిపై శ్రుతి ప్లాన్‌లు చెప్తుంది. మన ప్రయాణం గమ్యంవైపే సాగాలి అని చెప్తుంది శ్రుతి.

ఇక దివ్య కళ్లు తిరిగిపడిపోయిందనే విషయం నందుకి తెలియడంతో కోపంగా వస్తాడు. లాస్యని తీసుకుని వెళ్లి దివ్యని చూస్తాడు. దివ్య అలా ఉండేసరికి కంగారు పడతాడు. ‘ఏంటమ్మా ఇది?.. ఈ డాడీని వద్దనుకుంటున్నావా? నీకు ఏదైనా ప్రాబ్లమ్ నాతో చెప్పాలి కానీ.. ఇలా తిండి మానేయడం ఏంటి.? అని అంటాడు. ఆ మాటతో దివ్య.. ‘మేము కాదు.. మీరే మమ్మల్ని వద్దనుకుంటున్నారు. మీ పంతాలకు మమ్మల్ని బలి చేస్తున్నారు.. మమ్మల్ని ఒంటరి చేస్తున్నారు’ అంటూ కడిగిపారేస్తుంది. మిగిలిన వివరాలు రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.