యాప్నగరం

బుమ్రాకి ‘బూస్ట్‌‌’.. ఈ మెయిన్ వికెట్లే..!

కోల్‌క‌తాతో మ్యాచ్‌లో తానేసిన తొలి ఓవర్ రెండో బంతికే ప్రమాదకర హిట్టర్ క్రిస్‌లిన్ వికెట్ పడగొట్టిన బుమ్రా.. ఆదిలోనే ఆ

TNN 20 May 2017, 3:01 pm
ఐపీఎల్ పదో సీజన్‌ అంతిమ సమరానికి వేళైంది. టైటిల్ రేసులో తొలిసారి నిలిచిన రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌కి.. ఇప్పటికే రెండు సార్లు విజేతగా ఉన్న ముంబయి‌ ఇండియన్స్‌కి మధ్య ఆదివారమే ఫైనల్. గత మ్యాచ్‌లో పుణె చేతిలో ఘోర పరాజయం చవిచూసిన ముంబయి.. రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతాపై అద్భుత విజయాన్ని అందుకుని నూతన ఉత్సాహంతో ఫైనల్‌కి రెడీ అవుతోంది. ముఖ్యంగా మహేంద్రసింగ్ ధోనీ చేతిలో ఊచకోతకు గురైన ముంబయి బౌలర్లు కోల్‌కతా జట్టుని 107 పరుగులకే ఆలౌట్ చేసి మళ్లీ గాడినపడ్డారు. ధోనీ దెబ్బకి ఒకే ఓవర్‌లో రెండు సిక్సర్లతో సహా 15 పరుగులు సమర్పించుకున్న డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా.. కోల్‌కతా ప్రధాన వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ని మలుపు తిప్పాడు.
Samayam Telugu video jasprit bumrah sends 3 back in the hut
బుమ్రాకి ‘బూస్ట్‌‌’.. ఈ మెయిన్ వికెట్లే..!



కోల్‌క‌తాతో మ్యాచ్‌లో తానేసిన తొలి ఓవర్ రెండో బంతికే ప్రమాదకర హిట్టర్ క్రిస్‌లిన్ వికెట్ పడగొట్టిన బుమ్రా.. ఆదిలోనే ఆ జట్టుకి షాకిచ్చాడు. అనంతరం స్పెల్‌లో భాగంగా వేసిన తర్వాత ఓవర్ రెండో బంతికి మరో హిట్టర్ రాబిన్ ఉతప్పని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో కోల్‌కతా ఒత్తిడిలో పడింది. ఈ దశలో నిలకడగా ఆడుతూ జట్టు ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేసిన సూర్యకుమార్ యాదవ్ (31)‌ని ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా ఔట్ చేయడంతో చివరికి కోల్‌కతా 107 పరుగులకే ఆలౌటైంది. ఈ మూడు వికెట్లు ఫైనల్‌కి ముందు బుమ్రా‌‌లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయనడంలో సందేహం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.