యాప్నగరం

అంపైర్ తప్పిదం.. రోహిత్ శర్మ కోపంతో..?

మిచెల్ జాన్సన్ ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతిని విసిరాడు. దీంతో మనీవ్ పాండే పాయింట్ దిశగా ఫీల్డర్ లేకపోవడంతో అటువైపు తరలించేందుకు ప్రయత్నించాడు

TNN 14 May 2017, 2:48 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో అంపైర్ల తప్పిదాల పరంపర కొనసాగుతోంది. ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా ముంబయి ఇండియన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య శనివారం రాత్రి మ్యాచ్ జరిగింది. ఆసక్తికరమైన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకి దిగిన కోల్‌కతా విజయానికి 41 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన వచ్చింది. క్రీజులో మనీశ్ పాండే మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ లేకపోవడం‌తో ముంబయి కూడా గెలుపు కోసం పట్టువదలకుండా పోరాడుతోంది.
Samayam Telugu video what shocked rohit sharma mumbai indians were surprised
అంపైర్ తప్పిదం.. రోహిత్ శర్మ కోపంతో..?



ఈ సమయంలో బౌలింగ్‌కి వచ్చిన మిచెల్ జాన్సన్ ఆఫ్ స్టంప్‌కి దూరంగా బంతిని విసిరాడు. దీంతో మనీవ్ పాండే పాయింట్ దిశగా ఫీల్డర్ లేకపోవడంతో అటువైపు తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. బంతి అనూహ్యంగా బౌన్స్ తగ్గి బ్యాట్ కింది భాగాన్ని తాకుతూ కీపర్ అంబటి రాయుడు చేతుల్లో పడింది. ముంబయి ఆటగాళ్లు ఔట్ కోసం అప్పీలు చేయగా.. అంపైర్ ఎస్. రవి తిరస్కరించాడు. బంతి స్పష్టంగా బ్యాట్‌కి తాకినా ఔటివ్వకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్ నిర్ణయంపై కోపంతో బిగ్గరగా అరుస్తూ కనిపించాడు. చివరికి ఛేదనలో 164/8కే కోల్‌కతా పరిమితమై ఓటమి చవిచూసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.