Pics: డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిన హెల్త్ సర్వీస్ వర్కర్.. మూడేళ్ల జైలుశిక్ష

Authored byKrishna Kumar | Samayam Telugu 14 May 2022, 11:43 am

నేషనల్ హెల్త్ సర్వీస్ వర్కర్ అనగానే అలాంటి వారిపై సహజంగా ప్రజలకు ఒకింత అభిమానం, గౌరవం ఉంటాయి. ఆమె ఆ విలువను కోల్పోయిందా? మత్తు పదార్థాలకు బానిసై... బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుందా? ఇంతకీ ఆ వాట్సాప్ జోక్ ఏంటి? అది ఎలా ఆమెకు సమస్యగా మారిందో తెలుసుకుందాం.

  • ఆమె పేరు కర్ట్‌నీ హీలీ (Courtney Healy). వయసు 21 ఏళ్లు. వృత్తి రీత్యా నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) వర్కర్. రకరకాల పేషెంట్లకు సేవలు చేసేది. 2021 ఆగస్ట్‌లో... బ్రిటన్‌లో జరిగిన క్రీమ్‌ఫీల్డ్స్ ఫెస్టివల్‌లో పాల్గొని... క్లాస్ A డ్రగ్స్‌ (మత్తు పదార్థాలు)ని సప్లై చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ఈ కేసులో తాజాగా ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష పడింది.

    image credit - facebook -courtney.healy

  • హీలీ దగ్గరున్న బ్యాగులో 9 గ్రాముల కొకైన్ దొరికింది. మొత్తం 14 రేపర్ ప్యాకెట్లలో ఆ కొకైన్ ఉంది. తనకేమీ తెలియదనీ... ఓ ఫ్రెండ్‌ కోసం వాటిని తీసుకెళ్తున్నానని పోలీసులకు చెప్పింది.

    image credit - facebook - courtney.healy

  • డైలీస్టార్ రిపోర్ట్ ప్రకారం... ఆ కొకైన్ విలువ రూ.42,000 నుంచి రూ.1,10,000 దాకా ఉండొచ్చని నిపుణులు అంచనా వేశారు.

    image credit - facebook - courtney.healy

  • పోలీసులు తన మొబైల్‌ని ట్రాక్ చేశారని ఆమె ఊహించలేదు. అందులో ఆమె చాలా మంది ఫ్రెండ్స్‌కి వాట్సాప్ మెసేజ్‌లు పంపింది. వాటిలో ఒకటి జోకులా పంపింది. "ఈ విషయం అమ్మకు తెలిస్తే నన్ను జైలుకు పంపుతుంది" అని జోక్‌లా మరో ఫ్రెండ్‌కి పంపింది. ఆ జోకే పోలీసులకు ఆధారంగా మారింది.

    image credit - facebook - courtney.healy

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • పోలీసులు మరింతగా చెక్ చెయ్యగా... మరో షాకింగ్ మెసేజ్ కనిపించింది. "నేను రోజూ దాన్ని పీల్చుతాను. అప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్వర్గంలా అనిపిస్తుంది" అని ఉంది.

    image credit - facebook - courtney.healy

  • మరో మెసేజ్‌లో... "క్రీమ్‌ఫీల్డ్స్ ఫెస్టివల్‌కి డ్రగ్స్ తీసుకెళ్లడం ద్వారా... నాకు రూ.20,000 దాకా వస్తాయి" అని ఉంది.

    image credit - facebook -courtney.healy

  • మిగతా ఫ్రెండ్స్ ఎలా డ్రగ్స్ వాడుతున్నారో, ఎలా అనిపిస్తోందో కనుక్కునేందుకు హీలీ వారికి చాలాసార్లు మెసేజ్‌లు పంపింది.

    image credit - facebook - courtney.healy

  • బ్రిటన్.. వేల్స్‌లోని మేస్టెగ్‌లో ఉండే హీలీ... ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు 300 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించింది. అక్కడ డ్రగ్స్ వాడేవాళ్లను కలవాలి అనుకుంది. ఇంతలో పోలీసులు పట్టుకున్నారు.

    image credit - facebook - courtney.healy

  • పోలీసులు తన వాట్సాప్ మెసేజ్‌లు ఆల్రెడీ చదివేశారని తెలియని హీలీ... తనకేమీ తెలియదని... వారి ముందు పెద్ద హైడ్రామా ఆడింది. కానీ వాళ్లు పక్కా ఆధారాల్ని కోర్టుకు సమర్పించారు.

    image credit - facebook - courtney.healy

  • ఈ కేసును పరిశీలించిన జడ్జి ఆమె చర్యలను తీవ్రంగా తప్పుపట్టారు. యువతులు చెయ్యకూడని పని ఆమె చేసిందని మండిపడ్డారు. ఆమెకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తాజాగా తీర్పు ఇచ్చారు.

    image credit - facebook - courtney.healy

  • ఓ హెల్త్ కేర్ వర్కర్‌గా ఉంటూ... హీలీ... తను డ్రగ్స్‌ వాడటమే కాకుండా... వాటిని అందరికీ సప్లై చేస్తోందని దర్యాప్తులో తేలింది.

    image credit - facebook - courtney.healy

  • తన ఫ్రెండ్‌తో కర్ట్‌నీ హీలీ

    image credit - facebook - courtney.healy

  • తన ఫ్రెండ్‌తో కర్ట్‌నీ హీలీ

    image credit - facebook -courtney.healy