Mars Pics: మీరు ఎప్పుడూ చూడని మార్స్‌ ఫొటోలు.. అరుణ ప్రపంచం

Authored byKrishna Kumar | Samayam Telugu 28 Jun 2022, 4:48 pm

Mars Photos: అంగారక గ్రహాన్ని లోతుగా పరిశీలిస్తున్న పెర్సెవరెన్స్ రోవర్... అక్కడి అరుదైన, విచిత్రమైన ఫొటోలను నాసాకు పంపుతోంది. దీని కంటే ముందు క్యూరియోసిటీ రోవర్ పంపిన ఫొటోల కంటే.. ఈ ఫొటోల క్వాలిటీ, సైజ్ పెద్దగా ఉన్నాయి. అందువల్ల అరుణగ్రహ దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఫొటలను ఇప్పుడు చూద్దాం.

  • అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA)కు ప్రస్తుతానికి అత్యంత ఇష్టమైన గ్రహం అంగారకుడు (Mars). ఇప్పటికే క్యూరియోసిటీ రోవర్ ద్వారా వేల కొద్దీ ఫొటోలను తెప్పించుకొని పరిశీలించిన నాసా... 2021 ఫిబ్రవరి 18న మార్స్‌పై దిగిన పెర్సెవరెన్స్ రోవర్ (Perseverance Rover) ద్వారా మార్స్ మట్టిపై ప్రయోగాలు చేస్తోంది. పనిలో పనిగా వేల కొద్దీ ఫొటోలను తెప్పించుకుంటోంది. ఇప్పటివరకూ ఈ రోవర్ 2,85,448 ఫొటోలను నాసాకి పంపింది. రోజూ పంపుతూనే ఉంది. వాటిలో కొన్ని ఆసక్తికరమైన వాటిని ఇప్పుడు చూద్దాం.

    (image credit - Credit: NASA/JPL-Caltech/ASU)

  • పెర్సెవరెన్స్ రోవర్ 687 రోజులు పనిచేయాలని నాసా టార్గెట్ పెట్టుకుంది. ఈ 687 నంబర్ ఏంటంటే... భూమి ఓసారి సూర్యుడి చుట్టూ తిరిగేందుకు 365 రోజులు పడుతుంది కదా... అలాగే మార్స్‌కి 687 రోజులు పడుతుంది. ఇలా నాసా ప్రతీ విషయంలో పక్కా లెక్కలతో ముందుకెళ్తోంది.

    (image credit - Credit: NASA/JPL-Caltech/ASU)

  • ఈ ఫొటోని జూన్ 24, 2022న తీసింది. అప్పుడు మార్స్ పై టైమ్ మధ్యాహ్నం 12.23 అయ్యింది. రోవర్ తలపై ఉండే లెఫ్ట్ నేవిగేషన్ కెమెరా దీన్ని తీసింది. ఈ కెమెరా ద్వారానే రోవర్ స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటోంది.

    (image credit - NASA/JPL-Caltech/ASU)

  • మార్స్ పై మట్టిని సేకరించి.. దాన్ని ఓ చిన్న బాక్సులో ఉంచుకున్న రోవర్. ఎడమవైపు ఉండే మస్త్‌క్యామ్ Z కెమెరా ఈ ఫొటో తీసింది.

    (image credit - NASA/JPL-Caltech/ASU)

  • ఇలాంటి ఫొటోలు మరిన్ని చూడండిడౌన్‌లోడ్ యాప్
  • మార్స్ పై రకరకాల రంగుల్లో రాళ్లున్నట్లు ఈ ఫొటో చెబుతోంది. దీన్ని కుడివైపు మస్త్‌క్యామ్ Z కెమెరా తీసింది.

    image credit - NASA/JPL-Caltech/ASU

  • మార్స్‌పై విపరీతమైన గాలి రాపిడి ఉంటుంది. అందువల్ల రాళ్లు కూడా ఎలా అరిగిపోతున్నాయో ఈ ఫొటోలో చూడొచ్చు.

    image credit - NASA/JPL-Caltech/ASU

  • జూన్ 23, 2022న తీసిన ఈ ఫొటోలో.. భారీ ఇసుక తిన్నెతోపాటూ... దాని వెనక 3 వరుసల్లో ఉన్న కొండల్ని చూడొచ్చు.

    image credit - NASA/JPL-Caltech/ASU

  • రోవర్ ఇప్పుడు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు నీరు ఉండేదనీ, పెద్ద చెరువు లాంటిది ఉండేదని అంచనా. అందుకే అక్కడి ఇసుక కూడా నల్లగా ఉంది.

    image credit - NASA/JPL-Caltech/ASU

  • ఈ రాయిని మనం ఇంత దగ్గరగా ప్రత్యక్షంగా చూడాలంటే.. కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దీన్ని రోవర్ జూన్ 23, 2022న ఫొటో తీసింది.

    image credit - NASA/JPL-Caltech/ASU

  • ఇది జూన్ 18, 2022న తీసిన ఫొటో. అక్కడ గుండ్రంగా ఉన్న కన్నం రోవర్ పెట్టినదే కావచ్చు. ఇవి రా (Raw) ఫొటోలు కాబట్టి... నాసా వీటికి అప్పుడే వివరాలేవీ ఇవ్వదు.

    image credit - NASA/JPL-Caltech/ASU

  • మార్స్‌పై ఇవి ప్రత్యేకమైన రాళ్లు. ఇవి రెండేసి పొరలుగా ఉన్నాయి. అక్కడి గాలి వల్లే ఇవి ఇలా మారాయా అన్నది నాసా త్వరలో చెప్పే ఛాన్స్ ఉంది.

    image credit - NASA/JPL-Caltech/ASU

  • ఈ ఫొటోని గానీ యూఫాలజిస్టులు చూస్తే.. అదిగో పిరమిడ్ అని లేని పోని కథలు అల్లుతారు. అదో చిన్న రాయి మాత్రమే.

    image credit - NASA/JPL-Caltech/ASU

  • ఈ విచిత్రమైన రాయిపై కూర్చొని.. పకోడీ తింటూ.. మెలోడీ సాంగ్స్ వింటూ ఉంటే.. ఎలా ఉంటుంది?

    image credit - NASA/JPL-Caltech/ASU

  • అది రోవర్‌కి సంబంధించినదే... గాలికి ఎగిరి వెళ్లి అక్కడ చిక్కుకుంది.

    image credit - NASA/JPL-Caltech/ASU

  • అక్కడ మీరే ఉండి.. అలా నడుస్తూ... పెద్ద రాయి పక్క నుంచి అటు వెళ్తున్నారని ఊహించుకోండి.. ఎలా అనిపిస్తోంది?

    image credit - NASA/JPL-Caltech/ASU

  • 6,400 తాజా ఫొటోలు వెతికితే.. ఈ 16 ఆసక్తిగా అనిపించాయి. మీకు కూడా ఇవి నచ్చాయా?

    image credit - NASA/JPL-Caltech/ASU