యాప్నగరం

సెలవులతో రూ.19 కోట్లు సంపాదించిన ఉద్యోగి!

సెలవులతో ఆయన కోట్ల రూపాయలు సంపాదించాడు. అతడికి అంత సొమ్ము ఎలా లభించిందో తెలిస్తే.. మీరు కూడా ‘సెలవులు’ గురించి ఆలోచిస్తారు.

Samayam Telugu 30 Jan 2019, 9:55 pm
సెలవులతో సంపాదనా? అది కూడా రూ.కోట్లలో! అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, ఈ ఉద్యోగి ఏం చేశారో తెలుసుకోవల్సిందే. L&T సంస్థలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేజర్ విభాగానికి నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా పనిచేసిన అనిల్ కుమార్ మనిభాయ్ నాయక్ ఇటీవల పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనకు రూ.2.73 కోట్లు లభించాయి.
Samayam Telugu Untitled-10-11


అయితే, ఆయన పదవీ విరమణ సందర్భంగా పొందిన మొత్తం కంటే రెట్టింపు సొమ్మును ఆయన ‘సెలవులు’తో సంపాదించారు. 50 ఏళ్లుగా ఆ సంస్థకు సేవలందించిన ఆయన.. సెలవులు పెట్టిన సందర్భాలు చాలా తక్కువ. దీంతో ఆ సెలవులు అలాగే ఉండిపోయాయి. అలా ఆయన వాడుకోకుండా వదిలేసిన సెలవులకు చెల్లించాల్సిన మొత్తం ఎంతని లెక్కిస్తే.. మొత్తం రూ.19.4 కోట్లు అని తేలింది.
అనిల్ కుమార్ 1965లో ఎల్ అండ్ టీ సంస్థలో జూనియర్ ఇంజినీర్‌గా చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ స్థాయికి ఎదిగారు. నిత్యం పనిలో బిజీగా గడిపేయడం వల్ల సెలవులు తీసుకోవాలనే ధ్యాస కూడా ఆయనకు ఉండేది కాదు. చివరికి ఆ చిత్తశుద్ధి ఆయన్ను ‘లక్ష్మీదేవీ’ రూపంలో వరించింది. అంతేకాదు.. ఇటీవల ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఆయన ‘పద్మ విభూషన్’ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పటికైనా అర్థమైందా.. అతిగా ఆఫీసుకు డుమ్మా కొడితే చివర్లో ఏం కోల్పోతారో!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.