యాప్నగరం

Last Selfies on Earth : యుగాంత సెల్ఫీలు .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా

Last Selfies on Earth : భూమిపై 2065 సమయంలో యుగాంతం వస్తుందని ఫ్రాన్స్ తత్వవేత్త నోస్ట్రడామస్ చెప్పిన విషయం మనకు తెలుసు. మరి యుగాంతం వచ్చినప్పుడు మనుషులు సెల్ఫీలు తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆ సెల్ఫీలు ఎలా ఉంటాయి? అనే దానికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని అడిగితే... వచ్చిన సమాధానం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు AI ని ఎలా అడిగారు? ఫ్యూచర్ సెల్ఫీలను అది ముందే అంచనా వేసి ఎలా ఇచ్చింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 30 Jul 2022, 10:38 am
Last Selfies on Earth : నోస్ట్రడామస్ ప్రకారం ప్రపంచం అంతమయ్యే సమయంలో (end of the world) ఎటుచూసినా అగ్ని జ్వాలలు ఉంటాయి. ఆకాశం నేల అంతటా ఎర్రబారిన మంటలొస్తాయి. అల్లకల్లోలం అవుతుంది. ప్రళయ బీభత్సం కనిపిస్తుంది. అదేం విచిత్రమో గానీ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సరిగ్గా ఇలాంటి ప్రళయాల సెల్ఫీలనే ఇవ్వడం ఆశ్చర్యకర అంశం. విషయం ఏంటంటే... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (AI) ఇమేజ్ జనరేటర్ ని యుగాంత సెల్ఫీలు ఎలా ఉంటాయో అంచనా వేసి చూపించమని అడిగితే... అది ఓ హర్రర్ సినిమాలో దృశ్యాల్ని వెతికి చూపించింది. ఆ ఫొటోలతో చేసిన వీడియోని టిక్ టాక్ లోని రోబో ఓవర్‌లోడ్స్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వ్యక్తి "భూమిపై తీసిన చివరి సెల్ఫీలను చూపించమని AI ని అడిగాను" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సెల్ఫీలు వైరల్ అవుతున్నాయి.
Samayam Telugu last selfies on earth predicted by artificial intelligence watch video
Last Selfies on Earth : యుగాంత సెల్ఫీలు .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా

(image credit - twitter - volterinator)


యుగాంత సెల్ఫీలు

ప్రపంచం అంతమైపోయే సమయంలో సెల్ఫీలు తీసుకుంటా ఇలాగే ఉంటాయి అని ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇమేజ్ జనరేటర్ భావించింది. దాని సైంటిఫిక్ నేమ్ DALL-E 2. ఇక్కడ ముఖ్యమైన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రోజుల్లో చాలా రోబోలు మనుషుల లాగా దాదాపు ఆలోచిస్తున్నాయి. దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత ఎలాగైతే భాష, ఇతర విషయాలు నేర్చుకుంటారో... అలాగే ఈ రోబోలు కూడా కంటిన్యూగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాయి. ఫలితంగా రోజురోజుకూ వాటి తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. అందువల్ల అవి యుగాంతం ఎలా ఉంటుందో కూడా అంచనా వెయ్యగలవు.

(image credit - twitter - volterinator)

భయపెడుతున్న ఫొటోలు

DALL-E 2 మంచి ఫొటోలను చూపిస్తుందని అనుకుంటే... ఇలాంటి భయంకరమైన వాటిని చూపించి మరింత భయపెట్టింది. ఈ ఫొటోల్లో చివరి సెల్ఫీలు తీసుకుంటున్న మనుషులు.. అసలు మనుషుల లాగానే లేరు. సెల్ఫీ తీసుకునేలోపే చనిపోయినట్లుగా కనిపిస్తున్నారు. కొన్ని ఫొటోల్లో డైరెక్టుగా శవాలే సెల్ఫీలు తీసుకున్నట్లు ఉన్నాయి. పైగా వారి వెనకాల బ్యాక్ గ్రౌండ్ చాలా దారుణంగా ఉంది. మంటలు, పొగలు, బాంబు దాడులు, ప్రళయాల దృశ్యాలున్నాయి. నగరాలు నాశనం అవుతున్నట్లు కనిపిస్తోంది. తద్వారా యుగాంతం అత్యంత భయంకరంగా ఉంటుందని ఆ రోబో అంచనా వేసింది అనుకోవచ్చు.

(image credit - twitter - volterinator)

ఆ సెల్ఫీ ఫొటోల వీడియోని ఇక్కడ చూడండి (viral video)

భయపడుతున్న నెటిజన్లు

ఈ ఫొటోలు నెటిజన్లలో తెలియని ఆందోళన కలిగిస్తున్నాయి. అసలే ప్రస్తుతం కరోనా, మంకీపాక్స్ కి తోడు ప్రపంచ దేశాల్లో పరిస్థితులు బాలేవు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక సమస్యలు, కరవులు, అతి ఎండలు, అతి వర్షాలు ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీటి వల్ల మానసికంగా ఆందోళన చెందుతున్న మనుషుల్ని ఈ ఫొటోలు మరింత భయపెడుతున్నాయి. "సరే.. ఇక నిద్ర లేదు" అని ఓ యూజర్ కామెంట్ ఇవ్వగా... "స్కూల్స్ మాత్రం తెరిచే ఉంటాయి" అని మరో యూజర్ స్పందించారు. "కనీసం ఆ కెమెరా క్వాలిటీ అయినా బాగుంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "కొన్ని ఫొటోల్లో బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉంటోంది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. "వీటిని బట్టీ మనం అప్పటికి మరో గ్రహంపై జీవించే మార్గాన్ని తెలుసుకుంటామేమో" అని మరో యూజర్ రిప్లై ఇచ్చారు.

(image credit - twitter - volterinator)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.