యాప్నగరం

ఎట్టెట్టా.. ఒక్క కొమ్మకి 839 టమాటాలు.. ప్రపంచ రికార్డ్

అదృష్టం కొద్దీ ఈ రికార్డ్ అతనికి రాలేదు. గతేడాది కూడా బ్రిటన్‌లోనే అతి పెద్ద టమాటా చెట్టును పెంచి రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు మరో రికార్డ్ అతని వశమైంది.

Samayam Telugu 20 Sep 2021, 2:54 pm
మన దేశంలో వ్యవసాయం చేసే రైతులు తరచూ నష్టాలు చూస్తుంటారు. విదేశాల్లో మాత్రం రైతులు భారీ లాభాలు సాధిస్తున్నారు. కొందరైతే వ్యవసాయంపై రకరకాల ప్రయోగాలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. కష్టేఫలి అన్నట్లుగా... బ్రిటన్‌కి చెందిన 43 ఏళ్ల డగ్లస్ స్మిత్ (Douglas Smith) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసలు ఒక టమాటా చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి... మహా అయితే 40 లేదా 50 కాస్తాయి. అలాంటిది డగ్లస్... జస్ట్ ఒక్క కొమ్మ (branch) 839 చెర్రీ టమాటాలు (cherry tomatoes) కాయించి... ప్రపంచ రికార్డ్ (world record) సృష్టించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం (image credit - pixabay/matthiasboeckel)


డగ్లస్ స్మిత్ ఓ ఐటీ మేనేజర్. ఈ రికార్డును ఓ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. తనే స్వయంగా టమాట గింజ వేసి... చాలా సమయం దానికే కేటాయించినట్లు తెలిసింది. అందువల్ల ఇప్పుడు ఆయన మంచి ఫలితం పొందరు. రిపోర్టు ప్రకారం స్మిత్.. మార్చిలో టమాట విత్తనం వేశారు. వారానికి 3 నుంచి 4 గంటలు మొక్క దగ్గరే ఉండి... ఎక్కువ టమాటాలు ఒకే కొమ్మకు వచ్చేలా చేశారు. ఆ మొక్క గ్రీన్‌హౌస్‌లో ఉండటం వల్ల దానికి ఎలాంటి క్రిమి, కీటకాలు చేరలేదు.

టమాటా పంట చేతికొచ్చాక... స్థానిక పోలీసుల్ని పిలిచి వారి కళ్ల ముందే వాటిని తెంపారు. తద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వారికి తన రికార్డును సమర్పించాలి అనుకున్నారు. మొత్తం 839 టమాటాలు ఒకే కొమ్మకు కాసినట్లు తేలింది. ఇది చూసేందుకు వచ్చిన వారు ఆశ్చర్యపోయారు.


ఇంతకు ముందు 2010లో గ్రాహం టాంటెర్ (graham tanter) ఇలాగే... ఒకే కొమ్మకు 448 టమాటాలు వచ్చేలా చేశారు. ఇప్పుడు డగ్లస్... డబుల్ సంఖ్యలో కాయించి పాత రికార్డును బ్రేక్ చేశారు.

వామ్మో... బర్గర్‌లో మనిషి వేలు.. నమిలేసిందిగా!

డగ్లస్‌కి అదృష్టం కొద్దీ ఈ రికార్డ్ రాలేదు. గతేడాది కూడా బ్రిటన్‌లోనే అతి పెద్ద టమాటా చెట్టును పెంచి రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు మరో రికార్డ్ అతని వశమైంది. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో మరి.

టమాటాలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందా..

మామూలు టమాటాలు కావు:
మన ఇళ్లలోని టమాటాలకూ, చెర్రీ టమాటాలకూ కొన్ని తేడాలున్నాయి. చెర్రీ టమాటాలు చెర్రీ పండ్ల లాగా చిన్నగా ఉంటాయి. పైగా ఇవి గుండ్రంగానే (perfectly round) ఉంటాయి. చెర్రీ టమాటాలు పుల్లగా, ఎక్కువ రసంతో ఉంటాయి. వీటిని వంటల్లో కంటే... స్నాక్స్ తయారీలో ఎక్కువగా వాడుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.