యాప్నగరం

Mystery Sinkhole : భూమికి పడిన పెద్ద కన్నం .. అంతకంతకూ పెరుగుతున్న హోల్

Mystery Sinkhole : భూమికి అప్పుడప్పుడూ కన్నాలు పడటం సహజం. కానీ ఆ కన్నాల సైజు ఫిక్స్ గా ఉంటుంది. తర్వాత మెల్లగా మూసేస్తారు. కానీ చిలీలో పడిన ఓ కన్నం.. చాలా పెద్దగా ఉంది. పైగా అది అంతకంతకూ సైజు పెరుగుతోంది. ఏమవుతుందో శాస్త్రవేత్తలకే అర్థం కావట్లేదు. సైన్స్ సిద్ధాంతాలకు విరుద్ధంగా జరుగుతోందనే వాదన వినిపిస్తోంది. ఇక ఈ వార్త వైరల్ అయిపోయింది. ప్రజల్లో ఒక రకమైన భయం ఉంది. ఇది చివరకు దేనికి దారితీస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. వివరాలు చూద్దాం.

Authored byKrishna Kumar | Samayam Telugu 3 Aug 2022, 10:14 am
Mystery Sinkhole in Chile : ఈమధ్య వింత వార్తలు ఎక్కువైపోతున్నాయి అనిపిస్తోందా? అలా ఏం జరగట్లేదులే. కాకపోతే.. ఇలాంటి వార్తల్ని ప్రజలు ఆసక్తిగా చదువుతుండటంతో... సోషల్ మీడియాలో ఈ వార్తలకు ఎక్కువ షేరింగ్ ఉంది. కాబట్టి.. అందరూ వీటిని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. మ్యాటర్ ఏంటంటే... దక్షిణ అమెరికా దేశం చిలీ (Chile) తెలుసుగా... అక్కడ ఓ మైనింగ్ ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఉన్నట్టుండి భూమికి పెద్ద కన్నం పడింది. అది 82 అడుగుల వ్యాసార్థంతో ఉంది. అంటే.. మన ఊళ్లలోని పొలాల్లో పెద్ద బావులు ఉంటాయే... వాటికి డబుల్ సైజు అనుకోవచ్చు. ఇక్కడ రాగి తవ్వకాల కోసం గనులున్నాయి. ఈ ప్రాంతం చిలీ రాజధాని శాంటియాగో (Santiago)కి ఉత్తరంగా 665 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Samayam Telugu Mystery Sinkhole
భూమికి పడిన పెద్ద కన్నం .. అంతకంతకూ పెరుగుతున్న హోల్ (image credit - reuters)


పెద్ద గొయ్యే (Deep Sinkhole) :
శనివారం ఈ సింక్ హోల్ సంగతి తెలుసుకున్న చిలీ జాతీయ భూగర్భ మైనింగ్ సేవల సంస్థ.. ప్రత్యేక నిపుణుణ్ని అక్కడికి పంపించింది. ఈ గొయ్యి ఏకంగా 656 అడుగుల లోతు వరకూ ఉందని అంచనా వేశారు. లోపల నీరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ గొయ్యి అంతకంతకూ పెరుగుతోంది కాబట్టి... చుట్టుపక్కల వారిని అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతే... ఇదేమంత ప్రమాదకరమైనది కాదని ఇక్కడ మైనింగ్ చేపట్టిన లండిన్ మైనింగ్ వారు చెబుతున్నారు. లక్కీగా చుట్టుపక్కల పెద్దగా ఇళ్లులేవు. ఈ కన్నానికి దగ్గరగా ఉన్న ఇల్లు 1969 అడుగుల దూరంలో ఉంది. ఎక్కువ ఇళ్లు కిలోమీటర్ అవతల ఉన్నాయి. కాబట్టి ఆందోళన అక్కర్లేదు అంటున్నారు. (Mystery Sinkhole in chile)

ఇలాంటివి కామనేనా?
ఇక్కడ లండిన్ మైనింగ్ సంస్థకు 80 శాతం హక్కులు ఉండగా... మిగతా 20 శాతం జపాన్ కి చెందిన సుమిటోమో కార్పొరేషన్ చేతిలో ఉంది. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ఇలాంటి కన్నాలు పడటం సహజమే అని నిపుణులు అంటున్నారు. గనుల్లో మైనింగ్ తవ్వకాలు జరిపినప్పుడు... ఆ ఖాళీలను ఇసుక, మట్టితో పూడ్చివేస్తారు. ఐతే... ఎంత పూడ్చినా అవి రాళ్లంత గట్టిగా ఉండవు. అందువల్ల నేలలో కొంత మెత్తదనం ఉండటం, భూమిలో నీటి ప్రవాహం కారణంగా... గనుల్లో మట్టి తొలగిపోయి.. కన్నాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

National Watermelon Day : పుచ్చకాయ దినోత్సవం.. ఈ నిజాలు మీకు తెలుసా?
ఇదేమీ ప్రకృతి వింత కాదనీ... దీని గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మైనింగ్ నిర్వాహకులు చెబుతుంటే... ఆ గొయ్యి క్రమంగా సైజు ఎందుకు పెరుగుతోందో తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై స్థానికులు చాలా ఆందోళన చెందుతున్నారు. తాము మొదటి నుంచి గనుల తవ్వకాల్ని వ్యతిరేకిస్తున్నా... అవి చేపట్టారనీ.. దాని వల్ల చెడు ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని... స్థానిక కమ్యూనిటీ మేయర్ క్రిస్టోబాల్ జునిగా తెలిపారు. ఇలాంటి గొయ్యి ఏర్పడటం, సైజు పెరుగుతుండటం వంటివి ఇదివరకు ఎప్పుడూ జరగలేదని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.