యాప్నగరం

దీర్ఘాయుష్షు.. జన్యు మార్పిడిలో కొత్త అధ్యాయం.. 120 ఏళ్లు బతికే ఛాన్స్!

నిండు నూరేళ్లూ చల్లగా వర్ధిల్లు అనేది పాత మాట... నిండు 120 ఏళ్లూ చల్లగా వర్దిల్లు అనే రోజులు వచ్చేస్తున్నాయి. అదెలా సాధ్యమో తెలుసుకుందాం.

Samayam Telugu 28 Sep 2021, 1:33 pm
మరణాన్ని ఎలా జయించాలన్నది శతాబ్దాలుగా పరిశోధకులకు సవాల్ విసురుతున్న ప్రశ్న. వాహనాలకు పాడైన పరికరాల్ని తొలగించి కొత్తవి వేయడం మనం చూస్తున్నదే. తద్వారా వాహనాలు ఎక్కువ కాలం పనిచేస్తాయి. అదే విధంగా మనుషులకూ చేస్తున్నారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, కిడ్నీ మార్పిడి, కళ్ల మార్పిడి ఇలా ఎన్నో చేస్తున్నారు. అలాగే మనుషులకు యంత్రాలను సెట్ చేస్తూ వారిని సైబోర్గ్‌లుగా మార్చుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పరిశోధనలు బాగా జరుగుతున్నాయి. అంటే భవిష్యత్తులో మనుషులు రకరకాల యంత్రాలను, చిప్‌లను తమ బాడీలో సెట్ చేసుకోవడం సహజం అవుతుంది. అది అలా ఉంచితే... మనుషుల DNAలో మార్పులు చెయ్యడం ద్వారా ఎక్కువ కాలం బతికేలా చెయ్యడం ఎలా అనే కోణంలో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి ఆ క్రమంలో ఇదో ముందడుగు అనుకోవచ్చు. (image credit - pixabay - mohamed_hassan)
Samayam Telugu scientists found a new gene editing technology by which people can life more than 120 years full details
దీర్ఘాయుష్షు.. జన్యు మార్పిడిలో కొత్త అధ్యాయం.. 120 ఏళ్లు బతికే ఛాన్స్!


జన్యుపటం అధ్యయనం :

సైన్స్ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఏ మనిషికైనా ఆరోగ్యం, వాధ్యుల్ని డిసైడ్ చేసేవి జన్యువులే. ఆ జన్యువుల్లో మార్పులు చేయగలిగితే... వ్యాధులు రాకుండా, ఎక్కువ కాలం బతికేలా చెయ్యవచ్చు. కొత్త టెక్నాలజీతో జన్యువుల్ని (genetics) మరింత బాగా అర్థం చేసుకోవడానికి వీలవుతుందట. అలాగే మనుషులు 120 ఏళ్లకు పైగా బతికేలా చెయ్యవచ్చని అంటున్నారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో నిపుణుడైన సర్ శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ (Sir Shankar Balasubramanian)... జన్యుక్రమానికి సంబంధించి కొత్త విధానం కనిపెట్టారు. దీని ద్వారా డాక్టర్లు వ్యాధులను మరింత తేలిగ్గా గుర్తించేందుకు వీలవ్వనుంది. (image credit - pixabay - Furiosa-L)

కొత్త జీనోమ్ సీక్వెన్సింగ్:

జీనోమ్ సీక్వెన్సింగ్ (Genome sequencing) ద్వారా డాక్టర్లు... ఆరోగ్యంలో వచ్చిన మార్పులు, జన్యువుల్లో వచ్చిన మార్పుల్ని గుర్తిస్తారు. అందుకు ఇప్పటివరకు ఉన్న విధానాలు అంత త్వరగా వ్యాధుల్ని కనిపెట్టేలా లేవు. ఈ కొత్త అద్భుతమైన టెక్నాలజీ ద్వారా... బిడ్డలో జన్యువుల్ని త్వరగా గుర్తించగలరు. తద్వారా ఆ బిడ్డకు భవిష్యతతులో ఎలాంటి అనారోగ్యాలు రావచ్చు, అవి రాకుండా ఏం చెయ్యాలనేది త్వరగా నిర్ణయించగలరు. ఈ టెక్నలజీ ఇంకా ప్రారంభదశలోనే ఉన్నా... దీని ద్వారా కచ్చితంగా మానవుల ఆయుష్షును 120 ఏళ్లకు మించి పెంచగలం అంటున్నారు. (image credit - pixabay - jarmoluk)

ఆ నాలుగూ కీలకం:

సర్ శంకర్ కనిపెట్టిన కొత్త విధానాన్ని నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ అంటున్నారు. దీని ద్వారా డాక్టర్లు DNAను మరింత వివరంగా పరిశీలించగలరు. మన జన్యువుల్లో A, C, T, G అనేవి అత్యంత కీలకమైనవి. వాటిని లోతుగా అధ్యయనం చెయ్యడానికి ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని తెలిపారు. "మేం ఈ ప్రపంచాన్ని వదిలి ఎక్కడికో వెళ్లట్లేదు. ఇది అలాంటిది కాదు. మేము మొత్తం జన్యువుల విధానాన్ని పరిశీలిస్తున్నాం. అందుకు ఆల్రెడీ ఉన్న పద్ధతులతోపాటూ... కొత్తవి వాడుతున్నాం" అని సుబ్రహ్మణ్యన్ తెలిపారు. (image credit - pixabay - kkolosov)

విప్లవాత్మక మార్పులకు నాంది:

సుబ్రహ్మణ్యన్ చెప్పేది సాధారణ విషయం కాదు. బయాలజీలో ఇదో సంచలనం అనుకోవచ్చు. ఎందుకంటే... జన్యువుల్లో మార్పులు చేస్తే... వ్యాధులే రాకుండా చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ అదో కలలా ఉంది. ఇప్పుడు అది సాధ్యమయ్యే అవకాశాలు మెరుగయ్యాయనుకోవచ్చు. సుబ్రహ్మణ్యన్ బయోటెక్ కంపెనీ... కేంబ్రిడ్జి ఎపిజెనెటిక్స్... త్వరలో వ్యక్తుల జన్యువులను బట్టీ... వారికి సెట్ అయ్యే మందుల్ని తయారుచెయ్యాలనుకుంటోంది. అంటే మన జన్యువులను బట్టీ ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన మందులు తయారవుతాయి. (image credit - pixabay - DarkoStojanovic)

కృషికి తగిన ఫలితం:

జన్యువులను 2000 సంవత్సరంలో తొలిసారి సీక్వెన్స్ (క్రమాన్ని కనుక్కోవడం) చేశారు. ఇందుకోసం పదేళ్లు కష్టపడ్డారు. బిలియన్ డాలర్ల దాకా ఖర్చైంది. 2021లో 48 మానవ జన్యువులను ప్రాసెస్ చేశారు. ఇందుకు ఒక్కో జన్యువుకూ 1000 డాలర్ల కంటే తక్కువే అయ్యింది. ఇందుకోసం నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్ విధానం ఉపయోగించారు. త్వరలోనే ఈ టెక్నాలజీ ప్రపంచంలోని పరిశోధకులందరికీ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. (image credit - pixabay - DarkoStojanovic)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.