యాప్నగరం

16వేల మందితో పడుకుంది.. త్వరలో పెళ్లికి రెడీ!

ఓ సెక్స్ వర్కర్ జీవితం ఎలా ఉంటుందో యాష్లీ స్వయంగా చెప్పింది. 20 ఏళ్లుగా ఆమె అదే వృత్తిలో కొనసాగుతూ షాకింగ్ విషయాలు చెప్పింది.

Samayam Telugu 23 Sep 2021, 2:29 pm
మాజీ సెక్స్ వర్కర్, టిక్ టాక్ యూజర్ యాష్లీ (ashley) తాజాగా మీడియా ముందుకొచ్చింది. 20 ఏళ్లపాటూ పోర్న్ ఇండస్ట్రీకి సేవలందించానన్న ఆమె... త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. టిక్‌టాక్‌లో ఆమె ట్రాష్లీ ఎనానిమస్ (trashley_anonymous) అకౌంట్ కలిగివుంది. అందులో తరచూ రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తోంది. వాటిలో ఆమెతో గడిపిన చాలా మంది కనిపిస్తుంటారు. ఐతే... ఈ సందర్భంగా యాష్లీ చెప్పిన విషయాలు షాకిస్తున్నాయి. పోర్నోగ్రఫీ ఇండస్ట్రీ (porn industry)లోకి వెళ్తే బాగా డబ్బు వస్తుంది అనుకునేవారికి ఆమె చెప్పే విషయాలు ఓ హెచ్చరిక లాంటివి అంటున్నారు.
Samayam Telugu యాష్లీ (image credit - tiktok - trashley_anonymous)


20 ఏళ్లలో తాను ఎన్నో కష్టాలు పడ్డాననీ, రకరకాల వేధింపులను ఎదుర్కొన్నానని యాష్లీ తెలిపింది. 16వేల మందితో పడుకోవాల్సి వచ్చిందనీ... ఇదేమీ తేలికైన విషయం కాదని చెప్పింది. ఇక ఇప్పుడు ఆ వృత్తి నుంచి బయటకు వచ్చేశానన్న ఆమె... త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపింది. ఇక్కడో షాకింగ్ విషయం ఉంది. యాష్లీకి ఓ మహిళ నచ్చింది. ఆమెకు కూడా ఈమె నచ్చింది. దాంతో ఆమెను పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా తన 20 ఏళ్ల జీవితంలో ఏం జరిగిందీ ఆమెకు పూర్తిగా తెలిపింది.

సెక్స్ ఇండస్ట్రీ అనగానే అందమైన ప్రపంచం, గ్లామర్ హంగులు ఉంటాయని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి అలా ఉండదనీ... తన 20 ఏళ్ల వృత్తిలో ఏనాడూ గ్లామర్ అన్నది లేదని యాష్లీ తెలిపింది. ఎవరైనా ఈ కెరీర్ ఎంచుకునే ముందు బాగా ఆలోచించుకోవాలని సూచించింది. తన వీడియోల్లోని లాంగ్ టెర్మ్ ఎఫెక్ట్స్ అనే వీడియోలో ఆమె కన్నీరు పెట్టుకుంది.
ఏం షాట్ గురూ.. బాణంలోకి బాణం.. మాటల్లేవ్.. వీడియో
PTSD, నరకపు రాత్రులు, సెక్స్ డ్రైవ్ తగ్గిపోవడం, మత్తుపదార్థాలు, ఎఫెక్షన్‌తో ఉండలేకపోవడం వంటి ఎన్నో సమస్యలు ఈ వృత్తిలో ఉండేవారికి ఎదురవుతాయని యాష్లీ వివరించింది. ఈ వృత్తిలో ఉన్నప్పుడు ఆమెకు ఎవరూ ఇల్లు ఇచ్చేవారు కాదు. కొన్నిసార్లు దుండగులు కిడ్నాప్ చేసేవారు, కొన్నిసార్లు స్థానికులు చితకబాదేవారు. ఇలాంటి ఎన్నో అవమానాలను ఆమె ఎదుర్కొంది. యాష్లీ కారణంగా చాలా కుటుంబాల్లో చిచ్చు రేగింది. ఎన్నో జంటలు విడిపోయాయి. ఇలాంటి ఘటనలతో ఆమెకు తనపై ఆత్మాభిమానం (self-respect) పోయింది.

Hilda Nilsson: పిల్లలే ఆమె టార్గెట్.. నిశీధిలో అరాచకం
యాష్లీ వీడియోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిజాన్ని నిర్భయంగా చెబుతోందని కొందరు మెచ్చుకుంటుంటే... మరికొందరు అన్నీ చెత్త నిర్ణయాలే తీసుకుందని తిడుతున్నారు. ప్రస్తుతం నెగెటివ్ కామెంట్ల కంటే... పాటిజివ్‌వే ఎక్కువగా వస్తున్నాయి.

గతం గతమే కాబట్టి... దాన్ని మర్చిపోయి... భవిష్యత్తును పాజిటివ్‌గా తీర్చిదిద్దుకోమని కోరుతున్నారు. "యు ఆర్ అమేజింగ్... ఐ లవ్యూ" అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. "నిన్ను చూసి గర్వపడుతున్నాను" అని మరో యూజర్ స్పందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.