యాప్నగరం

రెండు తలల ఆవు.. పింక్ కలర్ పంది శరీరం.. పుట్టాక షాకింగ్ ఘటన

అది పుట్టింది ఆవుకే కాబట్టి దాన్ని ఆవు అనాలి. కానీ దాని శరీరం చూస్తే పందిలా ఉంది. పైగా అది పుట్టిన తర్వాత జరిగిన ఘటన అక్కడి వారికి కోలుకోలేని షాక్ ఇచ్చింది.

Samayam Telugu 27 Oct 2021, 3:38 pm
అప్పుడప్పుడు మనం విచిత్ర ఆకారాల్లో పుట్టే జంతువుల్ని చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటన రష్యాలో జరిగింది. అక్కడి ఖర్కాసియాలోని... మెట్కెచిక్ గ్రామంలో ఇది జరిగింది. ఓ ఆవుకు ఈ వింత దూడ పుట్టింది. కానీ ఈ విషయాన్ని ఆ రైతు నెల తర్వాత ప్రపంచానికి చెప్పాడు. పుట్టిన దూడకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది డూప్లికేట్ ఫొటో కాదు. నిజమైనదే. పుట్టిన దూడకు వెంట్రుకలు లేవు. రెండు తలలు ఉన్నాయి (two headed calf). రెండు నాలికలు ఉన్నాయి. శరీరం మాత్రం పంది శరీరంలాగా ఉంది (pig like body). కాళ్లు కూడా చిన్నగా పంది కాళ్లలాగానే ఉన్నాయి. పైగా శరీరం గులాబీ (pink) రంగులో ఉంది. చెప్పాలంటే ఇది దూడలా కంటే పందిలాగా ఉంది అని నెటిజన్లు అంటున్నారు. కానీ పుట్టింది దూడకు కాబట్టి... దీన్ని దూడగానే భావిస్తున్నట్లు తెలిపారు.
Samayam Telugu వింత దూడ (image credit - youtube - Science & Weird)


షాకింగ్ విషయమేంటంటే... ఈ వింత దూడ పుట్టే ముందు తల్లి ఆవు 7 గంటల పాటూ నరకం అనుభవించిందట. అంతలా ఇబ్బంది పెట్టి పుట్టిన దూడ కాసేపటికే చనిపోయిందట. అంతేకాదు... ఇది చనిపోయిన కొన్ని రోజులకు తల్లి ఆవు కూడా చనిపోయిందట. దీంతో ఆ రైతుకు కన్నీరే మిగిలింది. (strange news)

ఆ దూడ ఫొటోకి సంబంధించిన వీడియో (viral video)ని ఇక్కడ చూడండి.

"ఈ ఘటన బెయిస్కీ జిల్లా... మాట్కెచిక్‌ గ్రామంలోని ఓ ప్రైవేట్ గొడ్లచావిడిలో జరిగింది" అని ఖక్కాసియా వ్యవసాయ, ఆహార శాఖలో భాగమైన వెటెర్నరీ మెడిసిన్ విభాగం తెలిపింది. అధికారులో స్వయంగా చెప్పారు కాబట్టి ఇది నిజంగానే జరిగిందనేందుకు వారి మాటలు ఆధారంగా నిలిచాయి.

జంతువులు ఇలా పుట్టడానికి ప్రధాన కారణం జన్యుపరమైన సమస్యలే. తల్లి గర్భంలో అవి రూపాంతరం (mutation) చెందేటప్పుడు సరిగా చెందకపోతే ఇలా జరుగుతూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అసలేం జరిగిందో తేల్చాలని స్థానికులు కోరుతున్నారు. ఏం జరిగిందో తేల్చే కంటే... ఇకపై పశువుల ఓనర్లు స్వయంగా కృత్రిమ పద్ధతుల్లో గర్భదారణ ప్రక్రియలు చేపట్టకుండా... అధికారులే ఇలాంటి చర్యలను తమ నిర్వహణలో జరిపించేలా చర్యలు తీసుకుంటామని వెటెర్నరీ మెడిసిన్ విభాగం తెలిపింది.

కోటీశ్వరుడి భార్య.. ఆటోడ్రైవర్‌తో జంప్!
మొత్తానికి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు ఆశ్చర్యపరుస్తోంది. వింత దూడ పుట్టడమే చిత్రం అనుకుంటే... దాని తల్లి ఆవు కూడా చనిపోవడం విషాదకరమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.