యాప్నగరం

గాల్లో తేలే తివాచీ.. యూట్యూబర్ సృష్టి.. దుబాయ్‌లో అలాద్దీన్‌లా...!

ఆ తివాచీ గాల్లో ఎలా తేలుతోంది. దాన్ని యూట్యూబర్ ఎలా తయారుచేశారు. ఆ వీడియో నిజమైనదేనా... గ్రాఫిక్స్ మాయాజాలమా... నెటిజన్లు ఏమంటున్నారు?

Samayam Telugu 6 Dec 2021, 10:47 am
అసాధారణమైనది ఏది చూసినా ఆశ్చర్యం కలగడం సహజం. యూట్యూబ్‌లోని RhyzOrDie అనే ఛానెల్‌లో యూట్యూబర్... తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియోని లక్ష మంది దాకా చూశారు. ఐతే.. చాలా మంది దాన్ని నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే... అదో గాల్లో తేలే తివాచీకి సంబంధించిన వీడియో. అల్లాద్దీన్ సినిమాలో లాగా... ఆ తివాచీ గాల్లో తేలుతోంది. నీటిపై కూడా తేలుతూ వెళ్తోంది. చిత్రమేంటంటే... అలాంటి వీడియోని పోస్ట్ చేసిన యూట్యూబర్‌కి జస్ట్ 1290 మంది సబ్‌స్క్రైబర్లే ఉన్నారు. అతను చేసిన వీడియోల్లో ఇదే మోస్ట్ పాపులర్ వీడియో అయ్యింది. (Aladdin and the Magic Carpet video)
Samayam Telugu గాల్లో తేలే తివాచీ! (image credit - youtube - RhyzOrDie)


నిజానికి ఈ తివాచీకి సంబంధించి నవంబర్‌లో రెండు వీడియోలు పోస్ట్ చేశాడు. వాటిలో ఒకటి వైరల్ అయ్యింది. అరేబియన్ నైట్స్ కథల్లో అలాద్దీన్ ఒకటి. అందులో అలాద్దీన్‌కి ఓ తివాచీ ఉంటుంది. అది గాల్లో తేలగలదు. దానిపై కూర్చొని అలాద్దీన్ ఎక్కడికైనా వెళ్లగలడు. అలాంటి తివాచీని రియల్‌గా చూపిస్తే ఆశ్చర్యం కలగడం సహజం. (flying carpet)

ఈ వీడియోలో యూట్యూబర్ తనను తాను అలాద్దీన్‌లా కాస్టూమ్ వేసుకున్నాడు. దుబాయ్ రోడ్లు, మార్కెట్లలో కార్పెట్‌పై నిల్చొని... కూర్చొని దూసుకెళ్లాడు. ఆ తర్వాత అతన నీటిపై కూడా గాల్లో తేలుతూ వెళ్లినట్లు వీడియో ఉంది. (unbelievable flying carpet video)


ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి

చూశారుగా వీడియో. చిత్రంగా అనిపించింది కదూ. ఇది ఎలా సాధ్యమైందంటే... ఓ ఎలక్ట్రానిక్ లాంగ్ బోర్డ్ చుట్టూ PVC పైప్ ఫ్రేమ్ సెట్ చేశాడు. దానిపై కార్పెట్ సెట్ చేశాడు. తద్వారా మ్యాజిక్ కార్పెట్ లాగా చూపించాడు. చూసేవాళ్లకు ఇది గాల్లో తేలుతున్న తివాచీలా కనిపిస్తోంది. సముద్రంలో కూడా అతను వెళ్లడం ద్వారా నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లినట్లైంది.

అసలు నీటిపై కార్పెట్ ఎలా వెళ్లగలిగింది అనే దానికి అతను సమాధానం ఇచ్చాడు. ఈ స్టంట్ కోసం తాను ఈఫాయిల్ బోర్డ్ (eFoil board) వాడినట్లు తెలిపాడు. అంటే... ఎలక్ట్రిక్ ప్రొపెల్లర్ ఉన్న సర్ఫింగ్ బోర్డ్ అన్నమాట.

"ఈఫాయిల్ రైడర్‌కి ప్యాడిల్ అక్కర్లేదు. పంప్ కూడా అవసరం లేదు. తమ కాళ్లతోనే వాళ్లు బోర్డును ముందుకు నడపగలరు. ఈఫాయిల్ అనేది ప్రపంచంలోనే చిన్న వ్యక్తిగత మోటర్ ఉన్న వాటర్‌క్రాఫ్ట్" అని విండ్ ఫాయిల్ జోన్ తెలిపింది.

Video: సవ్యసాచి.. అతని బాణం గురితప్పదు..!
ఈ వీడియోకి వ్యూస్ గంటగంటకూ పెరుగుతున్నాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు దీన్ని బాగా షేర్ చేస్తున్నారు. రెండు వారాల కిందట... ఈ కార్పెట్ ఎలా పనిచేస్తుందో చెబుతూ... behind a scenes వీడియోని కూడా షేర్ చేశాడు. తద్వారా అతను ప్రజలను మోసం చెయ్యకుండా... నిజాయితీగా తాను ఏం చేసిందీ చెప్పినట్లైంది. నిజం తెలిశాక నెటిజన్లు... అతన్ని మరింత మెచ్చుకుంటున్నారు.

ఈ వీడియోల ద్వారా తనకు సపోర్ట్ ఇస్తున్న వారికి థాంక్స్ చెప్పిన యూట్యూబర్... తన ఐడియాలు మరింత మందికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.