యాప్నగరం

Bed on Wheels: చక్రాల బెడ్ చేసుకున్నాడు.. ఊరంతా నిద్రపోతున్నాడు

అతను రోజూ అదే బెడ్‌పై పడుకుంటాడు. కానీ ఆ బెడ్ రోజుకో ప్రదేశంలో ఉంటుంది. ఊరంతా తిరుగుతుంది. అతను ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి పడుకొని వెళ్లగలడు. సామాన్లు కావాలన్నా, పనులకు వెళ్లాలన్నా... అంతా బెడ్ తోనే జరిగిపోతుంది. వినడానికి విచిత్రంగా ఉన్న అతని కహానీకి సంబంధించిన వీడియో... సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. అందరూ ఆ వీడియో చూసి అలాంటి బెడ్ తమకు కూడా కావాలని అడుగుతున్నారు. దాంతో అతను వ్యాపార కోణంలో దాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నాడు.

Authored byKrishna Kumar | Samayam Telugu 27 Jun 2022, 9:42 am
Samayam Telugu చక్రాల బెడ్ చేసుకున్నాడు (image credit - twitter - nowthisnews)
చక్రాల బెడ్ చేసుకున్నాడు (image credit - twitter - nowthisnews)
మనలో చాలా మందికి ఉదయం నిద్రలేవడం ఇష్టం ఉండదు. ఇంట్లో వాళ్లు రెండుమూడుసార్లు బలవంత పెడితే అప్పుడు లేస్తాం. ఆ తర్వాత నిదానంగా పనులు చేసుకుంటాం. దాంతో ఆ రోజు మనం చెయ్యాలనుకునే పనులు ఆలస్యం అవుతుంటాయి. చైనాకి చెందిన ఝు జియాన్‌క్వియాంగ్ (Zhu Jianqiang) పరిస్థితి సేమ్ ఇలాగే ఉండేది. చదువుకునే రోజుల్లో అతను రోజూ ఆలస్యంగా నిద్రలేచేవాడు. స్కూలుకు లేటుగా వెళ్లేవాడు. పెద్దవాడయ్యాక కూడా ఆ అలవాటు పోలేదు. దాంతో తన కోసం చక్రాలతో నడిచే మంచాన్ని (bed with wheels) సొంతంగా తయారుచేసుకున్నాడు ఈ యున్నాన్ గ్రామ వాసి. (china man creative bed)

ఇప్పుడు ఝు ఎక్కడికి వెళ్లాలన్నా... బెడ్ పై ఉండే వెళ్తున్నాడు. అది మనుషులు నడిచే వేగంతో వెళ్తుంది. అతను రోజూ చేపలు పట్టేందుకు వెళ్తాడు. అందుకోసం నడవాల్సిన పనిలేకుండా బెడ్‌పైనే పడుకొని వెళ్తున్నాడు. చేపలు కూడా బెడ్ పై పడుకొనే పట్టుకుంటున్నాడు.

ఝు వృత్తి రీత్యా ఓ మెకానిక్. అందువల్ల ఇతరులు వదిలేసే పరికరాలను ఎలా వాడుకోవాలో తెలుసు. వాటిని రీసైక్లింగ్ చేస్తుంటాడు. అలాంటి వాటితోనే ఈ మంచాన్ని తయారుచేసుకున్నాడు. కలప, చక్రాల కోసం మొత్తం రూ.11 వేల దాకా ఖర్చైంది. వారంలో మంచం తయారైంది. ఇది ఎలా కావాలంటే అలా తిరగగలదు. దీనికి జాయ్ స్టిక్ ఉంది. దాని ద్వారా ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. సెన్సిటివ్ బ్రేక్స్ కూడా ఉన్నాయి. అందువల్ల దారిలో ఏదైనా అడ్డొస్తే... ఆటోమేటిక్‌గా బ్రేక్స్ పడతాయి. దీనికి ఉన్న బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే... 48 కిలోమీటర్లు వెళ్లొచ్చు. అంతేకాదు.. ఈ మంచం.. పైకీ, కిందకూ కదలగలదు కూడా.

దీనికి సంబంధించిన వీడియోని చైనా సోషల్ మీడియా యాప్ దౌయిన్ (Douyin)లో జూన్ 22న పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయ్యింది. దాన్ని 1.5 లక్షల మందికి పైగా చూశారు. 20వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. చాలా మంది అతన్ని మెచ్చుకున్నారు. కొంతమంది తమకు కూడా ఇలాంటిది కావాలంటున్నారు.
viral: భార్య కోసం ఆస్పత్రికి పామును తీసుకెళ్లాడు.. అదృష్టవంతురాలు అంటున్న డాక్టర్లు
ట్విట్టర్‌లోని nowthisnews అకౌంట్‌లో షేర్ చేసిన ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)
Indian Railways video: రైలు ఎక్కబోయి జారిపడిన గర్భిణీ.. సరిగ్గా అప్పుడే...
ఇప్పుడు ఝూ కొత్త ఆలోచనలు చేస్తున్నాడు. త్వరలో తన చక్రాల మంచానికి మరిన్ని మెరుగులు దిద్దుతాడట. సీట్ బెల్ట్ లాంటిది కూడా ఏర్పాటు చేస్తాడట. అంటే భవిష్యత్తులో తన మంచానికి పేటెంట్ తీసుకొని అతను ఇలాంటివి భారీగా ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఓ కొత్త స్టార్టప్ పారిశ్రామిక వేత్తగా అతను మారే ఛాన్స్ ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.