యాప్నగరం

Video: వెదర్ వార్తల్లో బూతు వీడియో.. వాతావరణం వేడెక్కింది!

ఇదెలా జరిగింది? ఆ సెక్స్ వీడియోపై న్యూస్ ఛానెల్ ఏం చెప్పింది? కేసు రాసిన పోలీసులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samayam Telugu 21 Oct 2021, 10:16 am
న్యూస్ ఛానెళ్ల లైవ్ ప్రసారాల్లో అప్పుడప్పుడూ అనూహ్య ఘటనలు జరగడం చూస్తూనే ఉంటాం. ఐతే... ఇప్పుడు జరిగినట్లుగా ఎప్పుడూ జరగలేదనుకోవచ్చు. మరీ ఇంత దారుణమైన పొరపాట్లు దాదాపు జరగవు. ఓ పక్క టీవీలో లైవ్‌లో వార్తలు వస్తుంటే.. అదే సమయంలో బూతు వీడియో ఒకటి ప్లే అయ్యింది. ప్రజలు షాక్ అయ్యారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు వారికి ఆ బూతు వీడియో ఏకంగా 13 సెకండ్లు ప్లే అవ్వడంతో... పిల్లల తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఒక్కసారిగా ఆ న్యూస్ ఛానెల్‌పై దుమారం రేగింది. కేసు నమోదైంది. లీగల్ సమస్య తలెత్తింది.
Samayam Telugu ఎలా జరిగింది (image credit - youtube -  VESA Channel)


ఈ ఘటన అమెరికాలో జరిగింది. వాషింగ్టన్ స్టేట్‌లోని ఓ న్యూస్ ఛానెల్... ఆదివారం ఉష్ణోగ్రత (weather report)పై వార్తలు ఇస్తోంది. యాంకర్ మరో రిపోర్టర్‌తో లైవ్‌లో వెదర్ ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. అంతలో యాంకర్‌కి కుడివైపున టాప్‌లో ఓ పోర్నోగ్రాఫిక్ వీడియో (pornographic video) ప్లే అవ్వసాగింది. ఆ విషయాన్ని యాంకర్, రిపోర్టర్, న్యూ్స్ ఛానెల్ సిబ్బంది... ఎవరూ పట్టించుకోలేదు. అంతా షాక్.

KERM 2 న్యూస్ స్టేషన్ ప్రమాదవశాత్తూ ఈ అడల్ట్ కంటెంట్‌ (adult content)ను అక్టోబర్ 17న సాయంత్రం 6.30 గంటల బులిటెన్‌లో ప్రసారం చేసింది. ఆ సమయంలో యాంకర్ మిషెల్లే బాస్... ప్రజలకు వాతావరణం ఎలా ఉందో చెబుతున్నారు. అమెరికాలో మంచి వాతావరణం ఉందని చెప్పారు. ఆ సమయంలో హాట్ సీన్ ప్లే అవ్వడంతో... ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యింది.

ఇప్పుడా లైవ్ వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. అందులో బూతు వీడియోని సెన్సార్ చేసి... యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. అది కాస్తా చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోకి వెళ్లింది.

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి

జరిగిన దానిపై KREM ప్రజలకు క్షమాపణ చెప్పింది. రాత్రి 11 గంటలకు వచ్చిన బులిటెన్‌లో "షో ఫస్ట్ పార్టులో ఓ తగని వీడియో ప్లే అయ్యింది. ఇలాంటిది మరోసారి జరగకుండా చూసుకుంటాం." అని యాంకర్ తెలిపారు.

ఇంట్లో భార్య.. జిమ్‌లో ప్రియురాలు.. కట్ చేస్తే.. డిష్యూం.. డిష్యూం!
ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదైంది. స్పోకానే పోలీసులు దీనిపై స్పందించారు. జరిగిన బ్లండర్‌ (sex video)పై తమకు వ్యూవర్స్ నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. "పోలీస్ డిపార్ట్‌మెంట్ లోని ప్రత్యేక బాధితుల విభాగం దీని సంగతి చూస్తోంది." అని ఓ స్టేట్‌మెంట్‌లో తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.