యాప్నగరం

అద్భుతం.. ఆ మెరుపు పొడవు 709 కిమీలు, ఎక్కడ ఏర్పడిందో తెలుసా?

అందుబాటులోకి వచ్చిన సరికొత్త టెక్నాలజీతో ఇప్పుడు ‘మెరుపు’ తీగల పొడవును కూడా చెప్పేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపు ఎక్కడ ఏర్పడిందో తెలుసా?

Samayam Telugu 27 Jun 2020, 5:58 pm
మీకు తెలుసా? వర్షాలు పడేప్పుడు ఏర్పడే మెరుపులు కొన్ని కిలో మీటర్ల పొడవు ఉంటాయి. అయితే, అవి ఒకటి రెండు కిలోమీటర్ల పొడవు ఉంటాయని అనుకుంటే పొరపాటే. మెరుపులు కొన్ని వందల కిలోమీటర్లు విస్తరిస్తాయి. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, బ్రెజిల్‌లో ఏర్పడిన అతి పొడవైన మెరుపు గురించి తెలుసుకోవలసిందే.
Samayam Telugu Image by Bogdan Radu from Pixabay


2018, అక్టోబరు 31న బ్రెజిల్‌లో ఏర్పడిన మెరుపు ప్రపంచంలోనే అతి పొడవైన మెరుపుగా గుర్తింపు పొందింది. దీని పొడవు 709 కిలో మీటర్లు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వాతావరణ విభాగం ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం ఎంత దూరం ఉంటుందో అంత వరకు ఆ మెరుపు విస్తరించిందని అర్థం చేసుకోవచ్చు.

Also Read: 26 ఏళ్లుగా బయటకెళ్లని కూతురు.. పిల్లి కళేబరాలతో నిద్ర, తల్లి ప్రేమ ఫలితం!

2019, మార్చి 4న అర్జంటీనాలో దాదాపు అంతే పొడవైన మెరుపు ఏర్పడిందని, 16.73 సెకన్లలో ఈ మెరుపు ఏర్పడిందని వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ (WMO) పేర్కొంది. అయితే, దాని ఖచ్చితమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు. కొత్తగా అందుబాటోకి వచ్చిన శాటిలైట్ లైటినింగ్ ఇమేజరీ టెక్నాలజీతో వీటిని అంచనా వేస్తున్నామని డబ్ల్యూఎంవో పేర్కొంది. గతంలో ఏర్పడిన మెరుపులు కంటే ఇవి రెట్టింపు పొడవైనవని తెలిపింది. జూన్ 20, 2017లో అమెరికాలోని ఓక్లాహోమాలో 321 కిమీల పొడవైన మెరుపు ఏర్పడిందని వెల్లడించింది.
Also Read: బాత్రూమ్‌లో పాములు.. 35 పిల్లలతో కాపురం పెట్టేసిన విష సర్పం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.