యాప్నగరం

Snake Attack During Sleep: గాఢ నిద్రలో బామ్మగారు.. పక్కలో పాము, వీడియో వైరల్!

ఆదమరిచి నిద్రవుతున్న బామ్మగారిని ఓ కొండ చిలువ నిద్రలేపింది. ఆమె అప్రమత్తంగా లేకపోతే మింగేసేదే!

Samayam Telugu 18 Oct 2019, 1:13 pm
Samayam Telugu తత1
మాంచి నిద్రలో ఉన్న బామ్మగారిని ఓ కొండ చిలువ డిస్ట్రబ్ చేసింది. పాపం రాత్రంతా ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌కు చెందిన కౌ సుదోసోపా (75) అనే వృద్ధురాలు నిద్రపోతున్న సమయంలో కొండచిలువ ఆమె గదిలోకి దూరింది. నెమ్మదిగా ఆమె పడక వద్దకు వచ్చిన కొండచిలువ ఆమె కాలును పట్టుకుంది. దీంతో ఆమె ఉలిక్కిపడి నిద్రలేచింది.

టార్చ్‌లైట్ వేసి చూడగానే కొండ కొండ చిలువ కనిపించింది. దీంతో ఆమె తన కొడుకు నక్రోన్ గదిలోకి పరిగెట్టింది. ఇదంతా ఆమె గదిలో ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. నక్రోన్ వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశాడు. అయితే, ఆ కొండ చిలువ ఆమె గది నుంచి నేరుగా బాత్రుమ్‌లోకి దూరింది. దాన్ని పట్టుకుని అడవుల్లో వదిలిపెట్టారు. ఈ ఘటనలో సుదోసోపాకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. Image: EPIC VIDEO STATION/YouTube

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.