‘‘ముసలి తాత.. ముడత ముఖం.. మురిసిపోయేనే..’’ అనే పాట ఈ పెద్దాయనకు కరెక్టుగా సరిపోద్ది. ఎందుకంటే.. లేటు వయస్సులో... లేత వయస్సు యువతిని పెళ్లాడి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతటితో ఆగకుండా.. ఊరంతా నోరు వెళ్లబెట్టేంత కట్న కానుకలను మినీ ట్రక్కులో ఎక్కించుకుని మరీ.. ఇంటికి ఊరేగింపుగా వెళ్లాడు. అతడిని చూసి ఊరంతా ‘‘ముసలోడికి దసరా.. పండుగ’’ అంటే ఇదే కాబోలు అంటూ ముక్కున వేలు వేసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో.. 22 రోజుల తర్వాత ఆ వధువుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
ఇండోనేషియాలోని జాకర్తాలో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 78 ఏళ్ల అభ శర్నా.. తన మనవరాలి వయస్సు ఉండే 17 ఏళ్ల నోనీ నావితాను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఇది బలవంతపు పెళ్లి కాకపోవడం గమనార్హం. వధువరులు ఇద్దరూ ఇష్టపడే ఈ పెళ్లి చేసుకున్నారు. అతడికి రూ.50 వేలు కట్నంతోపాటు మొటార్ సైకిల్, పరుపు, సోఫా సెట్ తదితరాలను కానుకలుగా అందించారు. ఓ మినీ వ్యాన్ తెచ్చుకుని మరీ శర్నా అవన్నీ తన ఇంటికి తీసుకెళ్లాడు.
Read Also: 10 పెళ్లిల్లు చేసుకున్న మహిళ.. ఆ ‘తృప్తి’ కలిగేవరకు ఆగదట!
పెళ్లియన 22 రోజుల తర్వాత శర్నా.. తనకు ఆమెతో సంసారం చేయడం ఇష్టం లేదంటూ విడాకుల పత్రాలు పంపించాడు. అవి చూడగానే నోనీ కుటుంబ సభ్యులు షాకయ్యారు. పెళ్లి తర్వాత వారి మధ్య ఎలాంటి గొడవలు కాలేదని, అంతా బాగానే సాగుతోందనే సమయానికి ఇలా షాకించ్చాడేంటీ అని ఆశ్చర్యపోయారు. పైగా, విడాకులు కోరడానికి తగిన కారణాలు కూడా చెప్పలేదు. అయితే, ఈ పెళ్లి శర్నా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని, పెళ్లి తర్వాత వారంతా అతడితో మాట్లాడటం మానేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని తెలిసింది. అంతేగాక, పెళ్లికి ముందు నోనీ గర్భవతి అని తెలిసి విడాకులు ఇచ్చాడనే పుకారు దావనంలా వ్యాపించింది.
Read Also: నడి బజారులో భర్తను అమ్మేసిన భార్య.. ‘శుభలగ్నం’ రిపీట్!
దీనిపై నోనీ సోదరి ఇయాన్ స్పందిస్తూ.. ‘‘ఇద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. శర్నా కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాతే ఈ పెళ్లి చేశాం. అకస్మాత్తుగా విడాకుల నోటీసులు ఎందుకిచ్చాడో అర్థం కావడం లేదు. పెళ్లికి ముందు నోనీ గర్భవతి అని వస్తున్న ఆరోపణల్లో కూడా నిజం లేదు’’ అని తెలిపింది. ఈ ఘటన వైరల్ కావడంతో.. అంతా శర్నాను తిట్టిపోస్తున్నారు. అనవసరం ఆ యువతి జీవితం నాశనం చేశావని మండిపడుతున్నారు. కొందరైతే.. ఈ వయస్సులో నీకు పిల్ల దొరకడమే కష్టం.. అలాంటిది ఇష్టపడి వచ్చిన అమ్మాయికి విడాకులు ఎందుకిస్తున్నావ్? అని అడుగుతున్నారు. అయితే, శర్నా మాత్రం.. ఆమెకు విడాకులు ఇవ్వడానికి గల కారణాలేవీ తెలపలేదు.