యాప్నగరం

టిండర్ యాప్‌లో 83 ఏళ్ల బామ్మ.. 50 మంది పైగా కుర్రాళ్లతో డేటింగ్!

పెద్దలకు మాత్రమే: ఆ బామ్మ మహా ముదురు. టెక్నాలజీని అందిపుచ్చుకుని మరీ డేటింగ్ కోసం కుర్రాళ్లకు గేలం వేస్తోంది. ఎందుకని అడిగితే ఆ ఏం చెప్పిందో చూడండి.

Samayam Telugu 25 Oct 2019, 2:11 pm
టిండర్ డేటింగ్ యాప్‌తో ఒంటరి వ్యక్తులు తోడు వెతుక్కుంటారనే సంగతి తెలిసిందే. అయితే, 83 ఏళ్ల బామ్మ కూడా దీన్ని విచ్చలవిడిగా వాడేస్తోంది. అయితే, ఆమె అందులో వెతుకుతున్నది తోడు కాదు. తన కంటే తక్కువ వయస్సు ఉండే కుర్రాళ్లతో రొమాన్స్. కాటికి కాలు చాపే వయస్సులో మీకు ఇదేం పోయేకాలం బామ్మా? అని నెటిజనులు ప్రశ్నిస్తుంటే.. ఆమె మాత్రం ‘‘కోరికలకు వయస్సుతో పనేంటి?’’ అని ప్రశ్నిస్తోంది.
Samayam Telugu Image Credit: Getty Images


అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్న హట్టి రెట్రోజ్(83) ఒంటరితనాన్ని దూరం చేసుకొనేందుకు టిండర్ యాప్‌లో చేరింది. వాటిలో మాంచి అబ్బాయి కనిపిస్తే చాలు.. డేటింగ్ కోసం రిక్వెస్టులు పంపుతోంది. ఇప్పటివరకు ఆమె చాలామందికి రిక్వెస్టులు పంపింది. వీటిలో కొంతమంది రిజెక్ట్ చేయగా.. కొందరు మాత్రం ‘అందుకు’ అంగీకరించారు.

Also Read: టిండర్ యాప్‌లో చేరిన యువతి.. పోర్న్ వీడియోలో ప్రత్యక్షం, ఆమెకు ఏమైంది?

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను ఒకప్పుడు డ్యాన్సర్‌ను. నేను పెళ్లి చేసుకుని 25 ఏళ్ల పైనే అవుతోంది. నా మాజీ భర్తతో మాంచి సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేశాను. అతడికి దూరమైన తర్వాత విరహవేదనతో అల్లాడాను. నేను ఇప్పటి వరకు ఎంతో మంది మగాళ్లతో నా పడక షేర్ చేసుకున్నా. అయితే, ఎవరూ ఇప్పటివరకు నాతో జీవితాంతం ఉంటానని చెప్పలేదు’’ అని తెలిపింది.

టిండర్ యాప్‌లో ఆమె ఎనిమిది నెలల కిందట చేరింది. ఇప్పటివరకు ఆమె సుమారు 50 మందితో ఏకంతంగా గడిపింది. ‘‘నాకు వచ్చే రిక్వెస్టుల్లో ఎవరిని పడితే వారిని సెలక్ట్ చేయను. అతడు నా మనసుకు నచ్చితేనే రమ్మని చెబుతాను. 19 ఏళ్ల వయస్సు యువకుడు కూడా నన్ను కోరి వచ్చాడు’’ అని తెలిపింది.

Also Read: ఆ కవలలకు తల్లి ఒకరే.. తండ్రులు మాత్రం వేర్వేరు!

భర్తను విడిచి పెట్టిన తర్వాత తన సెక్స్ జీవితాన్ని కొనసాగించేందుకు హట్టి ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి పేపర్లో కూడా ప్రకటన ఇచ్చింది. ‘‘నాకు పడక సుఖం అందించేందుకు యువకులు కావలెను’’ అని అందులో తెలిపింది. ఆ తర్వాత ‘టిండర్’ యాప్ గురించి తెలుసుకుని ఖాతా తెరిచింది.

Also Read: టిండర్ యాప్‌‌లో కలిసి ‘వన్ నైట్ స్టాండ్‌’తో సెక్స్.. అడ్డంగా బుక్కైన యువకుడు!

‘‘నా పేరు హట్టి, 83 ఏళ్ల అందగత్తె. నాకో మంచి స్నేహితుడు/ప్రేమికుడు కావాలి. నాతో సాహోసోపేత, అభిరుచికి తగినట్లు నడుకొనే వ్యక్తి కావాలి. ట్రంప్‌కు మద్దతు ఇచ్చేవాళ్లు, ఆటగాళ్లు నాకు వద్దు’’ అని తెలిపింది. ఆమె మాత్రమే రిక్వెస్టులు పంపేది అనుకుంటే పొరపాటే. ఆమెకు తోడుగా ఉండేందుకు కూడా చాలామంది ఆమెకు రిక్వెస్టులు పంపారు. అందులో ఎవరైతే తనకు నచ్చుతారో వారికి మాత్రమే ఈ బామ్మ అవకాశం ఇస్తూ వచ్చింది. హట్టి ప్రస్తుతం ఆమె కంటే 50 ఏళ్ల చిన్నవాడైన 33 ఏళ్ల షాన్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. మరి, ఈ బామ్మగారి సెక్స్ జర్నీ ఎంత దూరం సాగుతుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.