యాప్నగరం

వింత కవలల జననం.. పసిబిడ్డ కడుపులో మరో బిడ్డ!

ఓ మహిళకు కవల పిల్లలు పుట్టారు. కానీ, జతగా పుట్టలేదు. పుట్టిన బిడ్డ కడుపులో పిండం రూపంలో మరో బిడ్డ పెరుగుతోంది.

Samayam Telugu 21 Mar 2019, 8:24 pm
కొలంబియాకు చెందిన ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆమెకు పుట్టింది ఒక బిడ్డ కాదు, కవల పిల్లలు. చిత్రం ఏమిటంటే.. సాధారణ కవల పిల్లల్లా ఇద్దరూ సమానంగా ఎదగలేదు. పైగా, రెండో బిడ్డ పిండం రూపంలో శిశువు కడుపులో పెరగడం ప్రారంభించింది. దీంతో వైద్యులు దీన్ని అరుదైన కేసుగా భావించి శస్త్ర చికిత్సతో ఆ పిండాన్ని తొలగించారు.
Samayam Telugu twin-inside-twin-1-422


పిండంలో పిండం(fetus-in-fetu) ఏర్పడం వల్లే ఆ కవలలు అలా జన్మించారని వైద్యులు తెలిపారు. గతంలో కూడా ఇటువంటి జననాలు ఏర్పడ్డాయని వైద్యులు పేర్కొన్నారు. 1808లోనే బ్రిటీష్ మెడికల్ జర్నల్ ఇటువంటి జననాలను ప్రస్తావించిందని, ప్రతి ఐదు లక్షల జననాల్లో ఒకరు ఈ విధంగా పుడతారని పేర్కొందని తెలిపారు. ఇటీవల ఇండియా, సింగపూర్‌లో కూడా ఇటువంటి జననాలు ఏర్పడినట్లు వెల్లడించారు.

ఫిబ్రవరి 22న శిశువు తల్లి ఇత్జామారాకు పరీక్షలు నిర్వహించామని, అప్పుడే శిశువు కడుపులో మరో పిండం ఉన్న విషయాన్ని గుర్తించామని తెలిపారు. దీనిపై ఇత్జామారాకు అవగాహన కలిగించి, సిజారియన్ ద్వారా బిడ్డను బయటకు తీశామన్నారు. అనంతరం బిడ్డ లోపల ఉన్న పిండాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా వెలికి తీశామన్నారు. బిడ్డ కడుపులో ఉన్న పిండం రెండు ఇంచులు మాత్రమే ఉందని, దానికి చిన్న తల, కాళ్లు చేతులు ఉన్నాయని తెలిపారు. తల, గుండె లేవన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.