యాప్నగరం

viral video: ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

ప్రమాదం ఎటునుంచైనా రావచ్చు. రోడ్డెక్కితే మన కళ్లు నాలుగు దిక్కులూ చూసుకోవాల్సిందే. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఘటన. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

Samayam Telugu 28 Dec 2021, 12:41 pm
తాబేలుకి లాగానో, డైనోసార్లకు లాగానో మనకు రక్షణ కవచాలేవీ లేవు. మన శరీరం, స్కిన్ మెత్తగా ఉంటాయి. రోడ్డు ప్రమాదాలు జరిగితే... మనకు గాయాలయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ప్రాణాలు పోయినా ఆశ్చర్యం అక్కర్లేదు. అదే రోడ్డు ప్రమాదంలో తాబేలు ఉంటే.. దానికి రక్షణ కవచం ఉంటుంది కాబట్టి గాయాలు కాకుండా తప్పించుకోగలదు. అందుకే రక్షణ కవచం లేని మనం రోడ్డెక్కితే... చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ప్రమాదాలు ఎప్పుడూ కళ్ల ముందే కాదు... ఎటునుంచైనా జరగగలవు. అప్రమత్తతే అసలైన రక్ష. అందుకు ఈ వీడియోనే ఉదాహరణ.
Samayam Telugu పొంచి ఉన్న ప్రమాదం (image credit - twitter - @tragicomedias_1)


ట్విట్టర్‌లోని @tragicomedias_1 అకౌంట్‌లో డిసెంబర్ 26న ఓ ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాద వీడియోని పోస్ట్ చేశారు. ఆ ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అసలేం జరిగిందంటే... ఫ్లైఓవర్‌పై తన కారును రైట్ సైడ్ పార్క్ చేసిన ఓ వ్యక్తి... దానికి టెక్నికల్ సమస్య ఏం వచ్చిందో చెక్ చేసుకుంటున్నారు. అతను కారు డోర్ ఓపెన్ చేసి ఏదో చూసుకుంటుంటే... వెనకవైపున వాహనాలు జోరుగా వెళ్తున్నాయి.

వాహనాల్లో ఓ ట్రక్కుకి కుడివైపు ముందు టైర్ పంక్చర్ అయినట్లు కనిపిస్తోంది. దాంతో ఆ వాహనం అదుపుతప్పింది. అది వంకరగా ముందుకెళ్లి... ఓ కారును బలంగా ఢీకొట్టింది. ఆ కారు కూడా అదుపు తప్పి పల్టీలు కొడుతూ... తన కారును రిపేర్ చేసుకుంటున్న వ్యక్తివైపు రాసాగింది. సరిగ్గా అప్పుడే దాన్ని గమనించిన అతను కారు నుంచి ముందుకి పరుగులు పెట్టాడు. ఆ క్షణంలో పల్టీలు కొడుతూ ఆ కారు ఏకంగా ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. అలా తన వెనక జరిగిన ప్రమాదం నుంచి అతను కొద్దిలో తప్పించుకున్నాడు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి.

ఈ వీడియోని రెండు రోజుల్లో 1.16 లక్షల మందికి పైగా చూశారు. దాదాపు 2వేలకు పైగా లైక్స్ వచ్చాయి. గంటగంటకూ వ్యూస్ పెరుగుతున్నాయి. నిజానికి ఇది ఇప్పుడు జరిగిన ఘటన కాదు. 2020 నవంబర్ 11న జరిగింది. అప్పటి ఫుటేజ్‌ని ఇప్పుడు ట్విట్టర్‌లో పోస్ట్ చెయ్యడంతో... వైరల్ అయ్యింది.
viral video: వర్కవుట్ చెయ్యి.. జ్యూస్ తాగు.. కొత్త కాన్సెప్ట్ అదుర్స్
"ఇది మెకానికల్ ఫెయిల్యూర్" అని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు. "కారు ఎయిర్‌బ్యాగ్స్ వెంటనే ఓపెన్ అయ్యాయి. చివరికి ఏం జరిగిందో ఏమో" అని మరో యూజర్ స్పందించారు. "ఇది మెకానికల్ ఫాల్ట్ కాదు. ఆ రోడ్డుపై నల్లగా ఏదో ఉంది. మీరు వీడియోని జాగ్రత్తగా చూస్తే దాన్ని చూడగలరు. అది ట్రక్కుకి తగలడం వల్లే ప్రమాదం జరిగింది" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.