యాప్నగరం

హార్న్ కొట్టాడని.. కారును ఎత్తిపడేసిన ఎద్దు, వీడియో వైరల్

కారణం లేకుండా ఎవరైనా పదే పదే హార్న్ కొడితే చిర్రెత్తుకొస్తుంది కదూ. ఆ ఎద్దుకూ అదే ఫీలింగ్ కలిగిందో ఏమో ‘చంద్రముఖి’లో జ్యోతిక మంచాన్ని ఎత్తినట్లు కారును ఎత్తేసింది.

Samayam Telugu 7 Nov 2019, 8:40 pm
దే పదే హార్న్ కొడుతున్నాడనే కారణంతో ఆ ఎద్దుకు చిర్రెత్తుకొచ్చింది. ఒక్కసారిగా ఆ కారు వైపు దూసుకెళ్లింది. ‘చంద్రముఖి’లో దెయ్యం పట్టిన జ్యోతికలా తన కొమ్ములతో కారును పైకెత్తిసి కిందకు వదిలింది. దీంతో స్థానికులు రాళ్లు విసురుతూ, నీళ్లు చల్లుతూ ఆ ఎద్దు నుంచి కారును విడిపించారు. బీహార్‌లోని హాజీపూర్‌ రైల్వే స్టేషన్ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu ​Photo Credit: @amitalokbihar/Twitter
Photo Credit:


Also Read: హార్న్ కొట్టాడని.. కారును ఎత్తిపడేసిన ఎద్దు, వీడియో వైరల్

ఈ పొగరు బోతు ఎద్దును శాంతింపజేసేందుకు స్థానికులు చాలాసేపు ప్రయత్నించారు. ఎద్దు కారుపై దాడి చేయగానే.. అందులో ఉన్న డ్రైవర్ బయటకు పరుగులు పెట్టాడు. దీంతో అతడికి ఎలాంటి అపాయం జరగలేదు. కోపంతో చిందులేస్తున్న ఎద్దు కొద్ది సేపటికి శాంతించింది. ఆగ్రహంతో ఉండే ఎద్దు వైపు వెళ్లడం ప్రాణాలకే ప్రమాదకరం. అది తన కొమ్ములతో మనుషులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీరెప్పుడైనా అలాంటి ఎద్దును చూసి ఉంటే.. వాటికి దూరంగా సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోండి.

Also Read: పిల్లాడు కాదు పిశాచి.. ఎనిమిదేళ్ల వయస్సులోనే హత్యలు, చెల్లినీ వదల్లేదు!

ఎద్దు కారుపై దాడిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమిత్ అలోక్ అనే వ్యక్తి పోస్టు చేసిన ఈ వీడియోను సుమారు 2.40 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా థ్రిల్ అవుతారు.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.