యాప్నగరం

ఈ టీ పొడి కేజీ రూ.75,000.. మన ఇండియాదే..

టీ ఇంత ఖరీదా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, తప్పకుండా దీని ప్రత్యేకత గురించి తెలుసుకోల్సిందే. ఇది కేవలం గొప్పోళ్లు మాత్రమే తాగే టీ సుమా!

Samayam Telugu 31 Oct 2020, 12:10 pm
టీ పోడి అంత ఖరీదా? దాన్ని ఏమైనా వజ్రాలతో తయారు చేశారా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, దీని గురించి తెలుసుకోవల్సిందే. గౌహతీ టీ ఆక్షన్ సెంటర్ (GTAC) ఇటీవల ప్రత్యేకమైన టీని వేలానికి పెట్టింది. దీన్ని కొనుగోలు చేసేందుకు పలు టీ సంస్థలు పోటీపడ్డాయి. దీంతో కిలో టీ రూ.75 వేలకు అమ్ముడుపోయింది. కాంటేంప్రరీ బ్రోకర్స్ ప్రైవట్ లిమిటెడ్ సంస్థ ఈ టీని కొనుగోలు చేసినట్లు GTABA సెక్రటరీ దినేష్ బిహానీ వెల్లడించారు.
Samayam Telugu Representational image


‘‘కరోనా సమయంలో కూడా ఈ టీకి ఇంత ఆధరణ లభించడం చాలా గ్రేట్. ఈ ప్రత్యేకమైన టీ ఉత్పత్తి కోసం దిబ్రూగడ్‌లోని మనోహరీ టీ ఎస్టేట్ సెప్టెంబరు నెలలో ఎంతో శ్రమించారు’’ అని బిహానీ తెలిపారు. సూర్యకిరణాలు ప్రసరించడానికి ముందుగానే.. టీ బడ్స్‌ను కోస్తారు. ఇది చక్కని వాసనతో కూడిన ఈ మేలిరకం టీ తయారీ.. మిగతా వాటితో పోల్చితే చాలా ప్రత్యేకమైనవని మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రాజన్ లోహియా తెలిపారు. గతంలో ఈ టీ రూ.50 వేలు పలికినట్లు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.