యాప్నగరం

సెలవు ఇవ్వండి, లేకపోతే భార్యతో గొడవైపోద్ది.. కానిస్టేబుల్ లీవ్ లెటర్ వైరల్

ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఆ కానిస్టేబుల్ రాసిన లీవ్ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ లేఖలో అతడు తన భార్యపై భయాన్ని వ్యక్తం చేయడం అధికారుల ఆగ్రహానికి కారణమైంది.

Samayam Telugu 11 Dec 2020, 1:27 pm
నం ఎన్నో రకాల లీవ్ లెటర్లు రాసే ఉంటాం. కానీ, ఇలాంటిది ఎప్పుడు చూసి ఉండరు. మరి అతడికి లీవ్ లెటర్ రాయడం చేతకాదో.. లేదా అబద్దాలు చెప్పడం చేతగాదో తెలియదుగానీ.. ఇంట్లో సమస్యను అందులో ప్రస్తావించి అడ్డంగా బుక్కయ్యాడు. ఇంతకీ అతడు ఆ లీవ్ లెటర్‌లో ఏం రాశాడు? అధికారులు అతడిపై ఎందుకు సీరియస్ అయ్యారు?
Samayam Telugu Image Credit: Twitter


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ట్రాపిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దిలీప్ కుమార్ అహిర్వార్.. తన భార్య బంధువు పెళ్లికి హాజరయ్యేందుకు సెలవు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా తన పైఅధికారికి లీవ్ లెటర్ రాశాడు. మొదటి పేరాలో అన్నీ బాగానే రాసినా.. చివరికి పేరాలో మాత్రం.. సెలవు ఇవ్వకపోతే తనకు ఎదురయ్యే సమస్య గురించి చెప్పాడు. ‘‘నేను నా భార్య బావ పెళ్లికి హాజరుకాకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని నా భార్య హెచ్చరించింది’’ అని తెలిపాడు.

Read Also: కిల్లర్ ‘ఫుట్‌పాత్’.. దీనిపై నడిస్తే చంపేస్తోంది, వందలాది ప్రాణాలు బలి

ఈ లేఖ చూసిన అతడి సీనియర్ ఆఫిసర్ ఇర్షాద్ వాలీ.. దాన్ని క్రమశిక్షణరాహిత్యంగా భావించారు. అతడికి సెలవు ఇవ్వలేదు. ఇందుకు శిక్షగా అతడికి పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. అయితే, అహిర్వార్ నా లేఖలో తప్పేముందో చెప్పండి అంటూ.. దాన్ని వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజనులు స్పందిస్తూ.. ఇందులో తప్పేముందని అతడిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అతడు తన సమస్యను లేఖలో పేర్కొన్నాడని, మన్నించి సెలవు ఇవ్వాల్సిందని మరికొందరు అంటున్నారు. మరి, దీనిపై మీరేమంటారు?

Read Also: వామ్మో.. ఆమె గది నిండా జంతువులే! 1300 కుక్కలు.. 100 పిల్లులు.. 4 గుర్రాలు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.