యాప్నగరం

టాయిలెట్‌ హర్రర్.. దానిపై కుర్చుంటే పాము బయటకొచ్చింది

ఆమె టాయిలెట్‌కు వెళ్లి.. ఫ్లష్ కొట్టింది. అంతే.. అందులో నుంచి పాము తల బయటకు వచ్చింది. అంతే.. దాన్ని చూడగానే ఆమెకు ప్రాణం పోయినంత పనైంది.

Samayam Telugu 5 Aug 2020, 4:58 pm
టాయిలెట్‌లో కాంబోర్డ్ మీద కుర్చున్నప్పుడు తప్పకుండా చెక్ చేసుకోవాలి. ముందుగా నీళ్లు కొట్టిన తర్వాత కుర్చోవాలి. లేకపోతే.. ఈ మహిళకు ఎదురైన చేదు అనుభవమే మీకు కలగొచ్చు. అమెరికాలోని కొలరాడోకు చెందిన మిరండా స్టువర్ట్ అనే మహిళ టాయిలెట్‌కు వెళ్లింది. పని ముగించుకుని నీరు ఫ్లష్ చేస్తుంటే.. ఎంతకీ శుభ్రం కావడం లేదు. రెండు మూడుసార్లు ప్రయత్నించిన తర్వాత.. టాయిలెట్‌లోకి తొంగి చూసింది. అంతే.. అందులో నుంచి ఓ పాము బయటకొచ్చింది.
Samayam Telugu Image: Facebook


Read Also: హిట్లర్ సెక్స్ సీక్రెట్స్.. ‘సగమే’ మగాడు, తన్నితేనే భావప్రాప్తి.. నీచమైన కోరికలు!

ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ.. ‘‘టాయిలెట్‌ ప్లష్ చేసినా నీరు వెళ్లడం లేదనే అనుమానంతో అందులోకి చూశాను. అంతే.. అందులో నుంచి పాము తల పైకెత్తి చూసింది. దాన్ని చూడగానే భయపడిపోయాను’’ అని తెలిపింది. పామును చూడగానే ఆమె వెంటనే తన బాయ్‌ఫ్రెండ్‌కు కాల్ చేసింది. ఈ సమాచారం తెలియగానే.. అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్ సిబ్బంది వచ్చి పామును టాయిలెట్‌ను నుంచి బయటకు తీశారు. ఆ పాము పొడవు సుమారు నాలుగు అడుగులు ఉంది. ఈ విషయాన్ని ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ‘‘నా జీవితంలో ఎప్పుడూ ఇంతగా భయపడలేదు’’ అని పేర్కొంది. ఈ సందర్భంగా టాయిలెట్‌లోని పాము, దాన్ని బయటకు తీసిన చిత్రాలను పోస్ట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.