యాప్నగరం

Video: స్నానం చేద్దామని చెరువులో దిగాడు... మొసలి వచ్చి..!

ఆ చెరువులో మొసళ్లు ఉంటాయని అతను ఊహించలేదు. ఎక్కడా అతనికి మొసలి కనిపించలేదు. కానీ ఆ తెలివైన మొసలి అతన్ని చూసేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియో చూద్దాం.

Samayam Telugu 28 Oct 2021, 10:16 am
మొసలి గట్టుపైన ఉంటే మనుషులు దాన్ని ఓ ఆట ఆడుకోగలరు. అదే మొసలి నీటిలో ఉంటే... మనిషితో ఓ ఆట ఆడుకోగలదు. ఇప్పుడు అదే జరిగింది. మన దేశంలో తక్కువే గానీ... విదేశాల్లో మొసళ్లు విపరీతంగా ఉంటాయి. అక్కడ జనాభా తక్కువ... నీటి వాడకం తక్కువ కాబట్టి... చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది. చేపలూ పెద్దపెద్దవి పెరుగుతాయి. దాంతో... మొసళ్లకు మంచిగా ఆహారం లభిస్తుంది. అందువల్ల అవి పెద్ద సంఖ్యలో ఉంటాయి. అందువల్ల విదేశాల్లో చాలా మంది చెరువుల్లో దిగేందుకు సాహసించరు. కానీ ఓ యువకుడు చెరువులో దిగాడు. ఆ చెరువు చాలా పెద్దగా ఉంది. దరిదాపుల్లో ఎక్కడా... ఎలాంటి కాలుష్యమూ లేదు. కానీ అతన్ని మొసలి చూసేసింది. (crocodile attack video)
Samayam Telugu అదిగో మొసలి (image credit - twitter - ViralHog)


మొసలి నీటిలో ఉన్నప్పుడు శ్వాస పీల్చుకోవడానికి తప్పనిసరిగా తలను కొద్దిగా నీటిపైన ఉంచుతుంది. కానీ ఆ మొసలి ఎక్కడో దాక్కొని... అతను నీటిలో దిగగానే అతనివైపు రావడం మొదలుపెట్టింది. ఆ మొసలి తలను గుర్తించిన అతను చెరువు మధ్యలో నుంచి ఒడ్డుకు వచ్చేందుకు వేగంగా ఈత కొట్టడం మొదలుపెట్టాడు. కానీ ఆ మొసలి అతనికంటే వేగంగా ఈదుతూ వచ్చి... అతనిపై దాడి చేసింది (Man fight with crocodile). భుజాన్ని గట్టిగా కొరికింది.

మొసలి దాడి చేసినా అతను ధైర్యం కోల్పోలేదు. ప్రాణాలకు తెగించాడు. అప్పటికే అతనికి చెరువులో కింది నేల కాళ్లకు అందింది. అందువల్ల అతను మొసలి నుంచి దూరంగా జరిగేందుకు వీలైంది. (thrilling video) అలా అతను... మొసలి నుంచి విడిపించుకొని... మెల్లగా గట్టుపైకి వచ్చేశాడు. అలా అతను ప్రాణాలు దక్కించుకోగలిగాడు. కానీ మొసలి చేసిన గాయం వల్ల అతని భుజానికి రక్తం కారుతోంది (Man survived even after Crocodile attack).

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి


అతన్ని అదృష్టవంతుడు అనుకోవచ్చు. ఎందుకంటే మొసలి దాడి చేస్తే చంపేస్తుంది తప్ప వదలదు. ఏ కాలో, చెయ్యో పట్టుకుంటే... అది విరిగిపోయేవరకూ వదలదు. కానీ ఆ మొసలి ఎందుకో అతన్ని వదిలేసింది. బహుశా దానికి ఆల్రెడీ ఆ చెరువులో ఆహారం బాగానే లభిస్తుందేమో (wildlife video)

Video: ఖడ్గమృగానికి కోపమొచ్చింది.. ఏం చేసిందో చూడండి
ఈ థ్రిల్లింగ్ వీడియోని ట్విట్టర్‌లో @ViralHog వారు పోస్ట్ చేశారు. రెండ్రోజుల్లో దీన్ని 5వేల మంది దాకా చూశారు. "ఇదో పీడ కల లాంటిది. దాడి తర్వాత గట్టుపైకి వచ్చిన అతను.. ఇవతలకు వచ్చేయకుండా బుద్ధి హీనుడిలా అక్కడే నిలబడతాడేం" అని ఓ యూజర్ ప్రశ్నించారు. నిజమే... ఆ వ్యక్తి అక్కడే నిలబడితే... మరోసారి మొసలి దాడి చేసే ప్రమాదం ఉంది. అది తెలిసి కూడా అతను అక్కడే ఉండటం షాకింగ్ విషయమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.