యాప్నగరం

ఓర్ని.. ‘అక్కడ’ కొక్కెం తగిలించుకుని బంగీ జంప్.. ఉందా? ఊడిందా?

ఓ వ్యక్తి ఏకంగా తన పిరుదుల చర్మానికి కొక్కేలు తగిలించుకుని మరీ బంగీ జంప్ చేశాడు. నొప్పితో విలవిల్లాడాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూడాలంటే గుండె ధైర్యం ఉండాలి.

Samayam Telugu 19 Mar 2021, 11:08 am
Saint Petersburg: పిచ్చి పలు రకాలని అంటారు. ఆ పిచ్చి బాగా ముదిరితే.. ఈ వ్యక్తికి వచ్చిన ఆలోచనలే వస్తాయేమో. ఇతడు ఏం చేశాడో తెలిస్తే తప్పకుండా మీ ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన పిరుదులకు కొక్కేలు పెట్టించుకున్న ఇతడు.. వాటికి తాళ్లు కట్టుకుని బంగీ జంప్ చేశాడు. ఇంతకీ అతడు సక్సెస్ అయ్యాడా? లేదా చర్మం చీలి కిందపడ్డాడా అనేది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే.
Samayam Telugu Image Credit: Cobrapost/YouTube


రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చోటుచేసుకుంది. సాధారణంగా అంతా బంగీ జంప్‌ను నడుముకు తాళ్లు కట్టుకుని చేస్తారు. అయితే, ఇతడికి వేరే రకమైన పిచ్చి ఆలోచన వచ్చింది. తాళ్లను నడుముకు కాకుండా అతడి పిరుదుల చర్మానికి పెట్టించుకున్న రింగులకు కట్టాలని కోరుకున్నాడు. ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. అతడు కోరినట్లే తాళ్లను పిరుదులకు ఉన్న కొక్కేలకు తగిలించారు. సేఫ్టీ కోసం నడుముకు కూడా తాళ్లను కట్టారు. అనంతరం అతడు పైనుంచి దూకేశాడు.

Read Also: సీఎంపై నిరసన.. చిరిగిన జీన్స్ ఫ్యాంట్ ఫొటోలతో మహిళలు రచ్చ, ఇవిగో సిత్రాలు!

దూకిన వెంటనే అతడి బరువు పిరుదులకు అమర్చిన కొక్కెములపై పడటంతో అతడు బాధతో కేకలు పెట్టాడు. అయితే, లక్కీగా అతడు కిందపడలేదు. విజయవంతంగా అనుకున్నది సాధించాడు. ఈ జంప్ తర్వాత అతడి పిరుదుల చర్మం ఉందా? ఊడిందా అనేది మాత్రం తెలియరాలేదు. ఆ వీడియో చూసిన నెటిజనులకు.. అతడికి ‘అక్కడ’ దమ్ముంది కాబట్టే ఈ సాహసం చేయగలిగాడని తమదైన ‘భాష’లో కామెంట్లు చేస్తున్నారు. ధైర్యం ఉంటేనే ఈ వీడియోను చూడండి.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.