యాప్నగరం

కేరళలో మరో దారుణం.. కుక్క మూతికి టేపు, 2 వారాలుగా ఆకలితో నరకయాతన

కుక్క మూతికి టేపు వేసిన మూర్ఖులు. పాపం రెండు వారాలుగా ఆహారం, నీళ్లు లేక విలవిల్లాడిన మూగజీవి.

Samayam Telugu 9 Jun 2020, 1:22 pm
నిషి క్రూరత్వానికి మూగ జీవులు అల్లాడుతున్నాయి. ఇటీవల కేరళలో గర్భంతో ఉన్న ఏనుగు నోటిలో బాంబు పెట్టి చంపేసిన సంగతి తెలిసిందే. అది మరవక ముందే మరో ఆవు కూడా అదే తరహాలో గాయపడి నరకయాతన అనుభవించింది. తాజాగా కేరళలోని త్రిసూర్‌లో మరో ఘోరం బయటపడింది. గుర్తుతెలియని వ్యక్తులు కుక్క మూతికి టేపు వేశారు. ఒల్లూరు చౌరస్తాలో తిరుగుతున్న కుక్కను జంతుహక్కుల కార్యకర్తలు కాపాడి చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu కేరళలో మరో దారుణం.. కుక్క మూతికి టేపు, 2 వారాలుగా ఆకలితో విలవిల


మూతికి టేపుతో ఓ కుక్క తిరుగుతుందని పీపుల్ ఫర్ యానిమల్ వెల్ఫేర్ సర్వీస్ (PAWS)కు సమాచారం అందింది. దీంతో వారు ఒల్లూరు కూడలిలో ఉన్న ఆ కుక్కను పట్టుకున్నారు. ఈ సందర్భంగా పాస్ కార్యదర్శి రామచంద్రన్ మాట్లాడుతూ.. ‘‘కుక్క మూతికి టేపులను చాలా బలంగా అంటించారు. అవి ఆ కుక్క మూతిపై ఉండే చర్మాన్ని కోసేయడం వల్ల రక్తం కారుతోంది. టేపులు విప్పగానే ఆ కుక్క రెండు లీటర్ల నీళ్లు తాగింది. దాని మెడకు కాలర్ ఉంది. అది అరవకుండా ఉండేందుకు ఆ టేపును అంటించి ఉంటారు’’ అని తెలిపారు.

Also Read: అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం.. గీసింది మనుషులు కాదు, నేటికీ వీడని మిస్టరీ

కుక్కకు ఆ టేపు వేసి సుమారు రెండు వారాలు అవుతుందని, అప్పటి నుంచి ఆకలి, దప్పికలతో అల్లాడుతోందని రామచంద్ర పేర్కొన్నారు. అయితే, కుక్కలు ఆకలితో ఎక్కువ రోజులు జీవించగలవని, ఆ కారణంతోనే ఇది ఇంకా బతికి ఉందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూగజీవులతో మూర్ఖంగా ప్రవర్తిస్తున్న సైకోలకు కూడా అలాంటి శిక్ష విధించాలని నెటిజనులు మండిపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.