యాప్నగరం

టేబుల్ సొరుగులో 200 పైగా పాములు కాపురం.. ఒట్టి చేతులతో పట్టేసుకున్నారు!

బహుశా.. మీరు ఇలాంటి వీడియోను ఎప్పుడు చూసి ఉండరు. దీన్ని చూస్తున్నంత సేపు తెలియకుండానే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది.

Samayam Telugu 19 Aug 2020, 11:12 am
టేబుల్ సొరుగు తెరవగానే మీకు పాములు కనిపిస్తే ఎలా ఉంటుంది? దెబ్బకు హడలిపోతారు కదూ. ఇదిగో ఈ క్రేజీ వీడియో చూస్తే మీరు హడలిపోతారు. ఎందుకంటే.. ఈ డెస్కులో ఒకటి కాదు.. రెండు కాదు.. 200 పైగా పాములు కాపురం పెట్టేశాయి. ర్యాట్ స్నేక్‌‌ అనే ఈ పాములు అందులోకి ఎప్పుడు దూరాయో ఏమో.. వందలాది పిల్లలను పెట్టేశాయి.
Samayam Telugu Image Credit: Snake Wild/Facebook


‘స్నేక్ వైల్డ్’ అనే ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసిన ఈ వీడియో చూస్తే.. తప్పకుండా గుండె జారుతుంది. ఈ వీడియోలో ఉన్న యువకులు.. ఓ పాడుబడిన ఇంట్లోని ఓ టేబుల్‌ సొరుగును పగలగొట్టగా పాములు కనిపించాయి. ఓ యువకుడు సొరుగుకు కన్నం పెట్టి ఒట్టి చేతితో గుట్టల కొద్ది పాములను బయటకు తీశాడు. అతడు తీసేకొద్ది పాములు బయటకు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత మరో రెండు పెద్ద పాములను కూడా బయటకు తీశాడు. అయితే, ఈ వేట అంతటి ఆగలేదు. మరో సొరుగులో కూడా వందలాది పాము పిల్లలు ఉన్నాయి. వాటిని వీరు ఎంతో ధైర్యంగా చేతులతో బయటకు తీస్తుంటే.. మనకు కాళ్లు చేతులు వణుకుతాయి. ఈ టెరిఫిక్ వీడియోను చూసేందుకు మీరు ఫేస్‌బుక్‌లోని వారి పేజీని చూడాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాల వల్ల ఆ వీడియో ఇక్కడ పోస్టు చేయలేకున్నాం. ఈ కింది లింక్ మీద క్లిక్ చేసి.. ఆ భయానక వీడియోను చూసేయండి.
టేబుల్ సొరుగు నుంచి ఒట్టి చేతులతో పాములను బయటకు తీస్తున్న యువకులు (ఇక్కడ క్లిక్ చేసి వీడియోను చూడండి).

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.