యాప్నగరం

కారు ఇంజిన్, డ్యాష్ బోర్డుల్లో పడుకుని ప్రయాణం.. చివరికిలా దొరికారు

వామ్మో.. సలా సలా కాలిపోయే కారు ఇంజిన్‌లోకి దూరి మరీ ప్రయాణం. డ్యాష్‌బోర్డు.. కారు అడుగున ఇలా పోలీసులకు చిక్కకుండా ఎన్ని మార్గాలను ఎంచుకున్నారో చూడండి.

Samayam Telugu 27 May 2019, 9:12 pm
పోలీసుల కళ్లుగప్పి దేశ సరిహద్దులు దాటేయాలని ప్రయత్నించే వలసదారులు.. రకరకలా మార్గాలను ఎంచుకుంటున్నారు. కొద్ది నెలల కిందట కొంతమంది వలసదారులు పరుపుల్లో దాక్కొని సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. తాజాగా మరో నలుగురు వలసదారులు కారు డ్యాష్‌బోర్డు, ఇంజిన్ల వద్ద పడుకుని పోలీసులకు పట్టుబడ్డారు.
Samayam Telugu people-hidden-in-cars-1068x623


ఈ ఘటన మొరాక్కోలోని బెని ఎన్సార్‌లో చోటుచేసుకుంది. తనిఖీల్లో భాగంగా పోలీసులు మూడు కార్లను నిలిపారు. వాటిని పరిశీలించగా కారు ముందు భాగంలో స్టీరింగ్ వద్ద ఉండే డ్యాష్‌బోర్డు, వెనుక సీట్లు, ఇంజిన్ల మధ్య నక్కిన వలసదారులు కనిపించారు. నలుగురు వలసదారుల్లో 15 ఏళ్ల బాలిక కూడా ఉంది.

ఈ ప్రయాణం వల్ల వారికి నొప్పి కలగకుండా ఉండేందుకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే మెలిలా నగరంలో నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తిని ఏకంగా ఓ ట్రక్కు అడుభాగంలో వేలాడుతూ సరిహద్దు దాటాలని ప్రయత్నించాడు. అయితే, ఆ విషయం డ్రైవర్‌కు తెలీదని, అతడు లేని సమయంలో ట్రక్ కిందకు చేరి దానికి వేలాడేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు విచారణలో తెలిసిందని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.