యాప్నగరం

నా చావును లైవ్‌లో చూడండి.. పెద్దాయన ఆఖరి కోరిక, ఎందుకంటే..

ఆ పెద్దాయన అరుదైన కోరిక కోరాడు. తన చావును అంతా చూడాలంటూ.. ఫేస్‌బుక్ లైవ్‌ ప్రారంభించాడు. ప్రభుత్వం తనకు కారుణ్య మరణం ప్రసాదించలేదనే కారణంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు.

Samayam Telugu 5 Sep 2020, 7:53 pm
రణం ఎప్పుడు ఎలా సంభవిస్తుందో తెలీదు. కానీ, కొందరికి తమ మరణం కోసం ముందే తెలిసిపోతుంది. ఈ భూమిపై ఉండేందుకు ఇక ఒక్క ఛాన్స్ కూడా లేదని తెలిశాక తమ ఆఖరి కోరికలు చెబుతారు. కుటుంబ సభ్యులతో తమ ఆఖరి క్షణాలను గడపాలని కోరుకుంటారు. అయితే, ఈయన భిన్నమైన కోరిక కోరాడు. తన చావును ప్రజలంతా చూడాలని, సోషల్ మీడియాలో లైవ్ స్ట్రీమ్‌లో ప్రసారం చేయాలని తన సహాయకులను కోరాడు. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Samayam Telugu Image credit: euronews/YouTube


ఫ్రాన్స్‌లోని డిజోన్‌కు చెందిన 57 ఏళ్ల అలైన్ కోక్.. వింతైన వ్యాధితో బాధపడుతున్నాడు. ధమనుల గోడలు అతుక్కుని ఉండటం వల్ల
వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడు కదల్లేని స్థితిలో మంచంపై పడుకుని చికిత్స పొందుతున్నాడు. కనీసం మలమూత్ర విసర్జనకు కూడా లేవని స్థితిలో ఉన్న ఆయన.. చనిపోవడమే ఉత్తమ మార్గం అని భావించాడు. ఈ నేపథ్యంలో తనకు కారుణ్య మరణం (యూథనాసియా) ప్రసాదించాలని కోరుతూ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు లేఖ రాశాడు. ఏదైనా మందుతో నొప్పి లేని మరణానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. అయితే, మాక్రాన్ ఆయన విన్నపాన్ని తిరస్కరించారు.

Read Also: చెమట పట్టినా, స్నానం చేసినా ఆమె చనిపోతుంది!

ఫ్రెంచ్ చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తిని చనిపోవడానికి అనుమతించడం లేదా కారుణ్య మరణానికి మద్దతు తెలపడం కుదరదని స్పష్టం చేశారు. దీంతో కోక్.. తానకు తానే చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. శనివారం (సెప్టెంబరు 5) నుంచి ఆహారం తీసుకోవడం మానేశాడు. తన చావును అందరూ చూడాలంటూ తన మంచానికి మొబైల్, కెమేరాలను అమర్చి మరీ ఫేస్‌బుక్‌లో లైవ్‌లో అందరితో మాట్లాడుతున్నాడు. చివరి దశలో ఉండేవారికి చావు నరకయాతన అని, అలాంటి వ్యక్తులకు చనిపోయే హక్కు ఇవ్వాలని కోరేందుకే తన చావును లైవ్‌లో ప్రసారం చేయాలని కోరుకుంటున్నా అని తెలిపాడు. మరో నాలుగైదు రోజుల్లోనే అంతా తన చావును చూడవచ్చని పేర్కొన్నాడు.

Read Also: ఈ పసివాడిని ముట్టుకుంటే చర్మం ఊడి వస్తోంది.. అరుదైన సమస్యతో నరకయాతన

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.