యాప్నగరం

Video: వరుడికి వధువు ఫ్లైయింగ్ కిస్‌లు... క్యాచ్ పట్టేశాడుగా!

ఓవైపు పెళ్లి సందడి కొనసాగుతుండగా... ఆ వధువు వరుడికి ఫ్లైయింగ్ కిస్‌లు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఫన్నీ వీడియోని చూద్దాం.

Samayam Telugu 22 Oct 2021, 9:25 am
పెళ్లి అంటేనే సందడి. ఆ పెళ్లిలో వధూవరులు ఆనందంగా ఉంటే... ఇక సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. అందరి కళ్లూ వధూవరులపైనే ఉంటాయి కాబట్టి... వాళ్లు ఏం చేసినా అది హాట్ టాపిక్ అవుతుంది. రెండు కుటుంబాల చుట్టాల వారూ.. అందరూ వేడుకకు రావడంతో... మంచి కోలాహలం కనిపిస్తుంది. పైగా ఇప్పుడు కరోనా కూడా బాగా తగ్గింది కాబట్టి... పెళ్లి వేడుకలకు బంధువులు పెద్ద సంఖ్యలోనే వస్తున్నారు. అలాగే బ్యాండ్ బాజా, సంగీత్ కార్యక్రమాలు కూడా బాగానే జరుగుతున్నాయి (Wedding videos).
Samayam Telugu పెళ్లి సందడి (image credit - instgram - witty_wedding)


తాజాగా ఓ పెళ్లి వేడుకలో వరుడిని గుర్రంపై ఊరేగిస్తూ తీసుకొచ్చారు. డప్పు చప్పుళ్లతో వాతావరణం సందడిగా ఉంది. అప్పటికే అతని కోసం ఎదురుచూస్తున్న వధువు... అపార్ట్‌మెంట్ బాల్కనీ దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి కిందకు చూసింది. ఐతే... అక్కడ గ్రిల్స్ అడ్డు ఉండటం వల్ల ఆమెకు పూర్తిగా చూసే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ మాగ్జిమం ముందుకు వంగడంతో... ఆమెకు ఊరేగింపు కనిపించింది. (marriage video)

జనంలోని ఒకరిని పిలిచిన వధువు... వరుడికి తను పైన ఉన్న విషయం చెప్పమంది. ఆ విషయం తెలుసుకున్న వరుడు పైకి చూశాడు. పై నుంచి వధువు నవ్వుతూ పలకరించింది. థంప్సప్ సింబల్ చూపించింది. కింద నుంచి వరుడు కూడా చెయ్యి ఊపుతూ పలకరించాడు. ఆ తర్వాత వధువు వరుసగా రెండు ఫ్లైయింగ్ కిస్‌లు గాల్లోకి వదిలింది. అంతే కింద ఉన్న వారు అది చూసి కేరింతలు కొట్టారు. (bride flying kiss video)

ఆ ఫన్నీ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి:
View this post on Instagram A post shared by Wedding Planning_witty Wedding (@witty_wedding)


ఈ వధువు పేరు దీపాన్షీ జైన్. ఆమె ఓ డిజైనర్ అని తెలిసింది. ఆమెకు మేకప్ ఆర్టిస్ రాచెల్.. బ్రైడల్ మేకప్ వేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని witty_wedding అనే వెడ్డింగ్ బ్లాగ్‌లో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. దీన్ని 10 గంటల్లో 8వేల మందికి పైగా లైక్ చేశారు.

కాబోయే భార్యకు 60 కిలోల బంగారం గిఫ్ట్.. మోయలేక ఆపసోపాలు పడిన వధువు!
చాలా మంది ఈ వీడియోకి ఫన్నీ, హార్ట్ సింబల్ ఇమోజీలను కామెంట్లలో ఇస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.