యాప్నగరం

భూమికి భారీ చిల్లు.. ఈ గొయ్యి చూస్తే గుండె జారుతుంది!

సైబిరియాలో భూమిపై మరో భారీ చిల్లు ఏర్పడింది. వాతావరణ మార్పుల వల్ల 164 అడుగుల భారీ బిలం ఏర్పడిందని పరిశోధకులు అంటున్నారు.

Samayam Telugu 4 Sep 2020, 6:48 pm
వాతావరణ మార్పులు, భూతాపం వల్ల ఓజోన్ పొరకు చిల్లుపడుతున్న విషయం తెలిసిందే. కానీ, మనకు తెలియకుండానే మరో భారీ నష్టం కూడా జరిగిపోతోంది. భూమిపై భారీగా కుంగిపోతోంది. రష్యాకు చెందిన కొంతమంది జర్నలిస్టులకు సైబీరియాలోని యమల్ పెనిసులాలో భారీ బిలం కనిపించింది. 164 అడుగుల ఈ బిలం.. భారీ బావిని తలపిస్తోంది.
Samayam Telugu Image Credit: The Siberian Times/Twitter


మిథేన్ గ్యాస్ పేలుడు వల్లే ఈ బిలం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ భారీ గొయ్యిని జులై నెలలోనే గుర్తించారు. సుమారు నెల రోజులు తర్వాత ఈ బిలానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో తాజాగా ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేశారు. ఈ బిలాన్ని హైడ్రోలాకోలిత్ అంటారని, సైబిరియాలో ఇది 17వ బిలం అని పరిశోధకులు ‘ద సైబీరియన్ టైమ్స్’కు వివరించారు.

Read Also: బెడ్‌ రూమ్‌లో ఎలుక.. భర్త మర్మాంగాన్ని కొరికేసిన భార్య!

2014లోనే ఇలాంటి బిలాన్ని ఒకటి కనుగొన్నామని, భూమి అడుగున ఉండే మిథేన్ గ్యాస్ పేలుళ్ల వల్లే ఇలాంటి బిలాలు ఏర్పడతాయని వివరించారు. తాజాగా ఏర్పడిన ఈ భారీ బిలం గురించి స్థానికులు మాట్లాడుతూ.. కొద్ది రోజుల కిందట ఇక్కడ భారీ శబ్దాలు, పొగలు వచ్చాయని తెలిపారు. ఇప్పటికే ప్రపంచం కరోనాతో కల్లోలంగా మారింది. మున్ముందు ఇంకేమి జరగనున్నాయో!!

Read Also: అన్నదమ్ములందరికీ ఒకే భార్య.. ఎక్కడో కాదు, ఇండియాలోనే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.