యాప్నగరం

చేపల్ని తింటున్న మేక.. నిజం.. వీడియో చూడండి

యానిమల్ కింగ్‌డమ్‌లో ఏదైనా అసాధారణమైనది చూస్తే మనకు చిత్రంగానే ఉంటుంది. మేక చేపల్ని తినడం అలాంటిదే. ఎందుకో తెలుసుకుందాం.

Samayam Telugu 24 Sep 2021, 2:13 pm
అసాధారణ అంశాలు హాట్ టాపిక్ అవుతుంటాయి. వాటిపై ప్రజలు బాగా చర్చించుకుంటారు. అలాంటి ఘటన ఒకటి జరిగింది. మీరెప్పుడైనా సాధుజీవి అయిన మేక... చేపలు, మాంసం వంటివి తినడం చూశారా... బహుశా చూసి ఉండరు. మేకలు ఆకుల్ని తింటూ బతుకుతాయి. గడ్డి తింటాయి. అలాంటిది సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో (viral video) హల్ చల్ చేస్తోంది. అందులో దృశ్యం చూసి ప్రజలు తమ కళ్లను తామే నమ్మలేకపుతున్నారు. ఆ షాకింగ్ వీడియో (shocking video) కొన్ని రోజుల కిందటే... ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన వాళ్లు ఇది నిజమా, ఫేకా అని ప్రశ్నిస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం (image credit - pixabay - RitaE)


ఆ వీడియో క్లిప్‌లో ఓ మేక తన ముందు ఓ బాస్కెట్‌లో ఉన్న చేపలను చూసింది. వాటిలో ఒక చేపను నోట కరచుకుంది (goat eats fish). దాన్ని చ్యూయింగ్‌గమ్ నమిలినట్లు నమిలేసింది. సరే.. అనుకోకుండా తినేసింది అనుకుందామంటే... ఒకటి తిన్నా... మరో చేపను కూడా నోట కరచుకుంది. అంటే... అది చేపల్ని ఇష్టపడే తింటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియోని చూసి ప్రజలు నమ్మలేకపోతున్నారు. "విడ్డూరం కాకపోతే... మేకేంటి... చేపల్ని తినడమేంటని" అంటున్నారు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి. LINK

ఇలాంటివి నమ్మలాంటే మనసొప్పదు. జీర్ణించుకోలేం. కానీ ఇది నిజమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ చేపలు చూడ్డానికి చాలా గట్టిగా ఉన్నాయి. అంటే అవి ఫ్రెష్‌గా తెచ్చినవి కాకపోవచ్చు. ఈ నాన్-వెజ్ మేక అందరూ షాక్ అయ్యేలా చేస్తోంది.

ప్లాస్టిక్‌ టబ్‌ని కొమ్ముతో తిప్పిన గేదె.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

ఈ వీడియోని చాలా మంది తమ ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి షేర్ చేస్తున్నారు. ఇదో కలియుగ వింత అంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌తోపాటూ ఇతర సోషల్ మీడియా సైట్లలో ఈ మేక వీడియో హల్‌చల్ చేస్తోంది.

జంతువులు ఏం తిన్నా ముందుగా వాసన చూస్తాయి. తద్వారా అది తాము తినగలిగేదా, తినకూడనిదా అనేది గుర్తుపడతాయి. ఈ మేక కూడా చేపల్ని ముందుగా వాసన చూసింది కానీ... అలవాటు ఉన్నదానిలా లటక్కున ఓ చేపను నోట్లోకి పెట్టేసుకుంది. బహుశా అది తీవ్రమైన ఆకలితో ఉండి ఉండాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.

నటి బర్త్‌డే పార్టీ.. కొవ్వొత్తులు ఊదింది.. అంతలోనే షాక్.. వీడియో చూడండి

యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఎక్కడైనా జంతువులు, జీవరాశులకు సంబంధించిన వీడియోలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటోంది. ఎందుకంటే అవి ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకమైనవి చేసి... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వాటి వింత ప్రవర్తన నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.