యాప్నగరం

ఒకేసారి 1995 కేజీల కిచిడీ తయారీ.. గిన్నిస్ రికార్డులో స్థానం

పదులు కాదు వందలు కాదు.. ఏకంగా 1995 కిలోల కిచిడీని వండి గిన్నీస్ రికార్డులో స్థానం సాధించిన వంటగాళ్లు.

Samayam Telugu 16 Jan 2020, 12:32 pm
సంక్రాంతి నేపథ్యంలో హిమాచల్‌ప్రదేశ్‌లో 1995 కిలోల కిచిడీని తయారు చేశారు. ఇప్పటివరకు దేశంలో ఒకేసారి ఇంత భారీగా కిచిడీ వండలేదు. దీంతో ఈ కిచిడీ గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. సిమ్లాకు 55 కిలోమీటర్ల దూరంలోని తట్టపాణి గ్రామంలో ఈ కిచిడీని వండారు.
Samayam Telugu EOO4pEcU8AErKnK


Watch: వీడియో: పోలీస్ అధికారిని ఢీకొట్టిన రైలు.. నిందితుడిని వెంటాడుతుండగా ఘటన

ఈ గ్రామంలోని సట్లెజ్‌ నదీ తీరం వద్దకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఏటా అన్నదానం చేస్తారు. ఈ నేపథ్యంలో 1995 కేజీల కిచిడీని ఒకే పాత్రలో వండి గిన్నిస్‌ రికార్డ్స్‌ సాధించారు. 25 మంది వంటగాళ్లు ఐదు గంటలపాటు శ్రమించి ఈ కిచిడీ తయారు చేశారు. 450 కిలోల బియ్యం, 190 కిలోల ధాన్యాలు, 1,100 లీటర్ల నీరు, 90 కిలోల నెయ్యి, 55 కిలోల సుగంధ ద్రవ్యాలతో దీన్ని వండారు. దీంతో గతేడాది ప్రముఖ చెఫ్‌ సంజీవ్‌ కపూర్‌ తయారు చేసిన 918.8 కేజీల కిచిడీ రికార్డ్‌ బద్దలైంది.
Also Read: పోలీస్ స్టేషన్‌కే కన్నం వేసిన దొంగలు, 185 ఫోన్లు ఎత్తుకెళ్లి.. పోలీసులకు సవాల్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.