యాప్నగరం

ఇరుకైన కాలువలో భారీ క్రూయిజ్ షిప్ ప్రయాణం, ఉత్కంఠభరిత వీడియో!

అద్భుతం, అతి చిన్న ఇరుకైన కాలువ నుంచి టైటానిక్ కంటే అతి పెద్ద ప్రయాణికుల ఓడ దూసుకెళ్లింది. ఉత్కంఠభరితమైన ఈ అరుదైన దృశ్యాన్ని మీరూ చూడండి.

Samayam Telugu 17 Oct 2019, 4:25 pm
రుకైన.. సన్నని కాలువల్లో చిన్న చిన్న పడవులు మాత్రమే ప్రయాణించగలవనే సంగతి తెలుసు. కానీ, క్రూయిజ్ షిప్ లాంటి అత్యంత భారీ ఓడలు ప్రయాణించడం ఎప్పుడైనా చూశారా? వామ్మో.. అంత పెద్ద ఓడ చిన్న కాలువలోనా? అని ఆశ్చర్యపోతున్నారా! అయితే, తప్పకుండా గ్రీస్‌లో చోటుచేసుకున్న ఈ అద్భుతాన్ని కళ్లారా వీక్షించాల్సిందే.
Samayam Telugu 112


24 మీటర్ల వెడల్పు కలిగిన కోరింత్ కాలువలో ఇప్పటివరకు సాధారణ ఓడలు మాత్రమే ప్రయాణించాయి. అయితే, చరిత్రలో తొలిసారిగా అత్యంత భారీ ఓడ ఆ ఇరుకు కాలువలో ప్రయాణించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 22.25 మీటర్ల వెడల్పు కలిగిన ఎంఎస్ బ్రయమార్ ఓడ ప్రయాణికులతోపాటు ఈ కాలువలోకి ప్రవేశించింది. ఈ ఓడకు అటూ ఇటూ కేవలం ఒక మీటరు దూరం మాత్రమే ఉండటం గమనార్హం.

Read also: ఐదేళ్లుగా విమానంతోనే మహిళ సంసారం.. త్వరలోనే పెళ్లి!

ఓడ కొంచెం అటూ ఇటూ కదిలినా అది ఒడ్డును ఢీకొట్టే ప్రమాదం ఉంది. ఈ ఓడ మొత్తం పొడవు 196 మీటర్లు కాగా, బరువు 23,344 టన్నులు. కాలువలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ఓడలో 929 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓ కాలువకు అటూ ఇటూ ఉన్న పర్వతాలను ఢీకొట్టకుండా ఉండేందుకు రెండు టగ్‌బోట్లను వినియోగించారు.

కోరింత కాలువ గ్రీక్‌ను పెలోపొన్నేసియన్‌ నుంచి వేరు చేస్తుంది. ఇది కొరింతియన్, సరానిక్ గల్ఫ్‌లను కలుపుతోంది. ఈ కాలువను 1880 - 1893 మధ్యకాలంలో నిర్మించారు. ఈ కాలువ లేనప్పుడు ఓడలు పెనిన్సులా మీదుగా 430 మైళ్లు ప్రయాణించేవి. ఈ నేపథ్యంలో ఏజియన్ సముద్రం మధ్య ఉన్న పర్వతాన్ని తొలచి ఈ కాలువ నిర్మించారు.

Read also: మల ద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్.. చెన్నైలో చిక్కిన జంట!

ఇప్పటివరకు పర్యాటకులు ప్రయాణించే భారీ ఓడలేవీ ఈ మార్గంలో ప్రయాణించకపోవడం గమనార్హం. ఈ కాలువలో ప్రయాణించిన ఈ తొలి క్రూయిజ్ షిప్ అమెరికాకు చెందిన ఫ్రెడ్ ఓల్సెన్ క్రూయిజ్ లైన్స్ సంస్థది. సెప్టెంబరు నెలలో 25 రోజుల సముద్రయానం కోసం సౌతాంప్టన్ నుంచి బయల్దేరి ఇక్కడికి చేరుకుంది. ఓడ సన్నని కాలువ నుంచి ప్రయాణించడం చూసి పర్యాటకులు ఆశ్చర్యపోయారు. అంతా ఓడపైకి వచ్చి ఈ అరుదైన దృశ్యాన్ని కనులారా వీక్షించారు.

వీడియో: Image credit: YouTube

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.