యాప్నగరం

ఇంట్లో భార్య.. జిమ్‌లో ప్రియురాలు.. కట్ చేస్తే.. డిష్యూం.. డిష్యూం!

పతి, పత్ని ఔర్ ఓ... శతాబ్దాలుగా నడుస్తున్న చరిత్ర ఇది.. ఎంత మంది ఎన్నిసార్లు దొరికిపోయినా... మరో చోట మరో రకంగా ఇదే కథ నడుస్తూనే ఉంటోంది.

Samayam Telugu 19 Oct 2021, 1:18 pm
పెళ్లిలో జీవితాంతం కలిసుంటాను అని మాట ఇస్తారు... కలిసే ఉంటారు... కానీ తెరవెనక మరో దుకాణం తెరుస్తారు. భార్య-భర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు నమ్మకంతో జీవించాల్సిన చోట.. మధ్యలో ఆమె లేదా అతడు ప్రవేశించడంతో... కాపురాలు కల్లోలం అవుతున్నాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ చాలా కుటుంబాల్లో ఈ సమస్య ఉంటోంది. భార్య లేదా భర్త నచ్చకపోతే... విడాకులు ఇచ్చి... వేరే వివాహం చేసుకోవచ్చు. కానీ అలా చెయ్యరు. ఇటు భాగస్వామి కావాలి... అటు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం (extramarital relationship) కొనసాగించాలి అనుకుంటారు. ఇదే కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. తాజాగా ఇలాంటి మరో ఘటన తీవ్ర దుమారం రేపింది.
Samayam Telugu పతి పత్ని ఔర్ ఓ (image credit - youtube -  Malwa Mirror News)


మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిందీ ఘటన. అక్కడ ఓ మహిళ జిమ్‌లోకి వెళ్లి... అక్కడి సీన్ చూసి షాకైంది. ఆ మహిళ తన సోదరితో కలిసి కోహెఫిజా ప్రాంతంలోని జిమ్‌కు వెళ్లింది. ఇక్కడ ఆమె... తన భర్త... మరో మహిళతో కలివిడిగా ఉండటం చూసింది. నమ్మలేకపోయింది. ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కంట్రోల్ కోల్పోయింది. ఆవేశంగా చెప్పు తీసింది. (Shocking viral video)

చెప్పుతో ఆ మహిళ తన భర్త ప్రియురాలిని కొట్టడం ప్రారంభించింది. తన భర్త ప్రియురాలిని గట్టిగానే కొట్టింది. ఇంతలో, ఆమె భర్త ప్రియురాలిని కాపాడటానికి ప్రయత్నించాడు, కానీ అతని భార్య దూకుడు ముందు అతని ఆటలు సాగలేదు. (wife attacks husband video).

ప్రియురాలిని గొడవ నుంచి పక్కకు పంపిన భర్త... తన భార్యతో గొడవకు దిగాడు. దాంతో ఆమె... భర్తపై తిరగబడింది. ఆ తర్వాత మళ్లీ ప్రియురాలి దగ్గరకు వెళ్లి... ఆమెను జుట్టుపట్టుకొని లాగింది. ఆ జుట్టు వదలమని భర్త అడిగితే... అతని జుట్టు కూడా పట్టుకుంది. ఇలా పెద్ద యుద్ధమే జరిగింది. ఇదంతా అక్కడి వారు తమ మొబైళ్లలో వీడియో తీశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది (extramarital video).

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి:

ఈ ఘటన అక్టోబర్ 15న జరిగిందని తెలిసింది. దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఇందులో ఆ వ్యక్తి భార్య కొంతకాలంగా తన భర్తపై అనుమానంగా ఉంది. వేరే కాపురం ఏమైనా పెట్టారా అని ఓ రోజున నిలదీస్తే... అలాంటిదేమీ లేదన్నాడు. పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకొని బుర్ర పాడుచేసుకోవద్దని అన్నాడు. కానీ మాటిమాటికీ జిమ్‌కి వెళ్తుంటే ఆమెకు ఎక్కడో అనుమానం కలిగింది. దానిపై క్లారిటీ కోసం మరో మహిళతో కలిసి జిమ్‌కి వెళ్లి చూస్తే... ఆమె అనుమానమే నిజమైంది. అందుకే ఆమె కంట్రోల్ తప్పిందని పోలీసులు తెలిపారు.

Video: వామ్మో.. ఆ క్షణం అతను రాకపోయి ఉంటే..!
దీనిపై బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. తన భర్త అదనపు కట్నం కోసం కూడా తనను, తన తల్లిదండ్రులనూ వేధిస్తున్నాడని కూడా కంప్లైంట్ ఇచ్చింది. అటు తనను, తన ప్రియురాలినీ తన భార్య కొట్టిందని భర్త కంప్లైంట్ ఇచ్చాడు. ఇలా ఈ కాపురం కల్లోలం అయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.