యాప్నగరం

భార్యను చంపేసిన కరోనా బాధితుడు.. కారణం విని షాకైన పోలీసులు

కరోనా వైరస్ ఇప్పుడు భార్య భర్తల మధ్య కూడా చిచ్చుపెడుతోంది. హత్యలకు కూడా పురిగొలుపుతోంది. అతడు తన భార్యను ఎందుకు చంపాడంటే..

Samayam Telugu 15 Apr 2020, 12:15 pm
రోనా వైరస్ వల్ల దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువ రోజులు ఇళ్లకే పరిమితం కావడం వల్ల ప్రజలు అనేక మానసిక ఇబ్బందులకు గురవ్వుతున్నారు. ముఖ్యంగా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయి. లాక్‌డౌన్ ఇంకొన్నాళ్లు కొనసాగితే విడాకుల కేసులు పెరగవచ్చని పలు సర్వేలు ఊటంకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లండన్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. కరోనా వైరస్ ఇప్పుడు భార్యభర్తలు, కుటుంబాల మధ్య కలహాలకే కాకుండా హత్యలకు కూడా దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Samayam Telugu GettyImages-1142097909 - Copy


ఉత్తర లండన్‌లోని ఎడ్మాంటన్‌లో నివసిస్తున్న హుస్సేయిన్ ఎగాల్ (65) తన భార్య మార్యన్ (57) దారుణంగా కొట్టి చంపాడు. పొరిగింటివాళ్లకు అనుమానం కలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎగాల్ ఇంటికి చేరిన పోలీసులు రక్తపు మడుగులో పడివున్న మార్యన్ కనిపించింది. దీంతో పోలీసులు ఎగాల్‌ను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు.

Also Read: ఈ మెసేజ్ చదివితే.. ఆత్మ వెంటాడుతుంది, ఈ వీడియోలో దెయ్యం ఆమేనా?

మార్యన్‌ను తానే చెప్పానని ఎగాల్ వెల్లడించాడు. ఎందుకు చంపావని ప్రశ్నించిన పోలీసులకు అతడు షాకింగ్ వివరాలు చెప్పాడు. తాను కొద్ది రోజులుగా కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్నానని తెలిపాడు. ఆ వైరస్ సోకుతుందనే భయంతో భార్య మార్యన్ తనని ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరిందన్నాడు. దీంతో కోపం వచ్చి ఆమెను కొట్టి చంపేశానని తెలిపాడు.

Also Read: వామ్మో.. మనోళ్లు ‘పోర్న్’ తెగ చూసేస్తున్నారట, 95 శాతం ట్రాఫిక్ ఇండియాదే!

ఎగాల్ తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పడంతో పోలీసులు అతడి శాంపిళ్లను వైద్య పరీక్షల కోసం పంపించారు. రిపోర్టుల్లో అతడికి పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆన్‌లైన్‌లో వీడియో కాల్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును జూన్ 14కు వాయిదా వేశారు. కరోనా వైరస్ వల్ల యూకేలో 93,873 కేసులు నమోదయ్యాయి. 12,107 మంది చనిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.