యాప్నగరం

దుబాయ్‌లో బోటు నుంచి సముద్రంలో పడ్డ ఇండియన్.. 2 గంటలు ఈతకొట్టి...

దుబాయ్‌లోని సముద్ర జలాల్లో.. పుట్టిన రోజు పార్టీ ఎంజాయ్ చేయడానికి రెండు అంతస్తుల బోటులో వెళ్లిన ఓ భారతీయుడికి ఎదురైన చేదు అనుభవం ఇది.

Samayam Telugu 8 Dec 2020, 7:13 pm
దుబాయ్‌లో నివసిస్తున్న 27 భారతీయుడికి ఎదురైన చేదు అనుభవం ఇది. ఓ పార్టీ నేపథ్యంలో బోటులో సముద్రంలోకి వెళ్లిన అతడు.. ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నాడు. బోటు నుంచి సముద్రంలో పడిపోయి.. నరకయాతన అనుభవించాడు. సుమారు 2 గంటల సేపు సముద్రంలో ఈత కొడుతూ.. ప్రాణాలతో తీరానికి చేరుకున్నాడు.
Samayam Telugu Representational image (Pixabay)


Read also: భలే ఆఫర్.. రక్తదానం చేస్తే కిలో చికెన్ లేదా పనీర్ ఉచితం

రాజ్‌వీర్ వజాకీ అనే వ్యక్తి తన స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా ఓ బోటులో సముద్రంలోకి వెళ్లాడు. వేడుక కోసం అంతా ఆ బోటులోని పై అంతస్తులోకి వెళ్లారు. రాజ్‌వీర్ కూడా కింది అంతస్తు నుంచి పైకి వెళ్తుండగా కాలు జారి సముద్రంలో పడ్డాడు. ఆ వెంటనే అతడు గట్టిగా కేకలు పెట్టాడు. విజిల్స్ కూడా వేశాడు. పార్టీ సందడిలో అవేవీ బోటులో ఉన్నవారికి వినిపించలేదు. ఆ సమయంలో బాగా చీకటిగా ఉండటంతో ఎవరూ నీటిలో పడిన రాజ్‌వీర్‌ను గమనించలేదు. దీంతో అతడు చాలాసేపు ఆ బోటును పట్టుకుని ఉన్నాడు.

Watch Also: ఎడారిలో వింత.. మనుషుల్లేని ఆ ప్రాంతంలో త్రికోణ స్తంభం, ఏలియన్స్ నిర్మాణమా?

ఆ బోటు తిరిగి ఒడ్డుకు చేరితే బతికిపోవచ్చని భావించాడు. కానీ, బోటు అతడిని మరింత లోపలికి తీసుకెళ్లడం మొదలుపెట్టింది. అదే జరిగితే తాను బతికి బయటపడటం కష్టమని భావించాడు. దూరంగా.. బుర్జ్ అల్ అరబ్ భవనం లైటింగ్ కనిపించింది. దీంతో రాజ్‌వీర్ అటుగా ఈదటం మొదలుపెట్టాడు. అలా రెండు గంటల సేపు సముద్రం ఈదుతూనే ఉన్నాడు. లక్కీగా అదే సమయంలో అటుగా మరో బోటు వచ్చింది. అందులో ఉన్న వ్యక్తుల రాజ్‌వీర్‌ను రక్షించారు. ఆ వెంటనే అతడు తన సోదరులకు ఫోన్ చేసి జరిగినదంతా చెప్పాడు. ఈ విషయం తెలిసి ఆ బోటులో ఉన్న అతడి స్నేహితులు షాకయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.