యాప్నగరం

ఈ మాస్క్ విలువ రూ.11 కోట్లు.. ప్రత్యేకతలు తెలిస్తే షాకవుతారు

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ మాస్కు ప్రత్యేకతలు గురించి తెలిస్తే.. మీరు ‘‘నీ మూతి బంగారం’’ గానూ అని ఆశ్చర్యపోతారేమో!!

Samayam Telugu 10 Aug 2020, 5:06 pm
Samayam Telugu Image Credit: Bloomberg QuickTake/Twitter (Grabbed from Video)
రోనా వైరస్ వల్ల మూతికి మాస్కు పెట్టుకోవడం తప్పనిసరిగా మారిన సంగతి తెలిసిందే. వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా అరికట్టడంలో మాస్క్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో మాస్కులకు డిమాండ్ బాగా పెరిగింది. ఇటీవల దుస్తులతోపాటు దానికి మ్యాచింగ్ మాస్కులు కూడా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం మార్కెట్లో ఒక్క మాస్క్ కనీస విలువ రూ.30 ఉంది. అయితే, వీటిని బయటే కొనాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇటీవల పుణెకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా బంగారంతో మాస్కును తయారు చేయించుకున్నాడు. అతడిని చూసి ఒడిశాకు చెందిన మరో బంగారు బాబు కూడా గోల్డ్ మాస్క్ తయారు చేయించుకున్నాడు. వీరి మాస్కును చూసిన జనాలు.. ఓరి వీళ్ల వేషాలో అనుకున్నారు.

అయితే, ఇజ్రాయెల్‌లో తయారు చేసిన ఈ సరికొత్త మాస్క్ గురించి తెలిస్తే తప్పకుండా నోరు వెళ్లబెడతారు. ఎందుకంటే.. దీని ఖరీదు అక్షరాలా రూ.11 కోట్లు. వామ్మో.. అంత ధరా?? కొంపదీసి వజ్రాలతో తయారు చేశారా ఏమిటీ అనేగా మీ సందేహం? ఔను, నిజమే. దాన్ని వజ్రాలతోనే తయారు చేశారు.

Also Read: రాకాసి తల్లి.. ముగ్గురిని చంపి, శవాలను కరిగించి.. కేకులు, సబ్బుల తయారీ!

ఇజ్రాయెల్ నగల తయారీ సంస్థ యవెల్ కంపెనీ.. బంగారం, వజ్రాల కలబోతతో ఈ ఖరీదైన మాస్కును తయారు చేసింది. ఇందులో మరో ప్రత్యేకత ఏమిటంటే.. మాస్కు తయారీకి 18 కేరట్ల తెల్ల బంగారాన్ని ఉపయోగించారు. 3,600 తెల్ల, నల్ల డైమండ్లతో చూడగానే ‘ఔరా’ అనిపించేలా దీన్ని రూపొందించారు. ఓ కస్టమర్ దీన్ని ఎంతో ఇష్టపడి తయారు చేయించుకున్నారని, దీనికి వైరస్ నుంచి రక్షణ కోసం ప్రత్యేకంగా N99 ఫిల్టర్లను కూడా ఈ మాస్క్‌కు ఏర్పాటు చేశామని డిజైనర్ ఇసాక్ లావేయ్ తెలిపారు.

వీడియో:
Also Read: కుక్కతో అక్రమ సంబంధం.. పిల్లలకు ఉరివేసి హత్య, 3 నెలల తర్వాత వీడిన మిస్టరీ!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.