యాప్నగరం

అడవిలోనే జీవితం.. కరోనాకు భయపడి వనవాసం చేస్తున్న కుటుంబం

సామాజిక దూరం అనే విషయాన్ని ఇతడు సీరియస్‌గానే తీసుకున్నాడు. ఇంటిని వదిలి కుటుంబంతో సహా అడవికి మకాం మార్చేసి ప్రకృతి మధ్య జీవిస్తున్నాడు.

Samayam Telugu 17 Apr 2020, 11:12 am
రోనా వైరస్ నేపథ్యంలో ఓ కుటుంబం అడవి బాట పట్టింది. ప్రజల మధ్య నివసిస్తే వైరస్ సోకే ప్రమాదం ఉందనే భయంతో సామాజిక దూరం పాటించడమే ఉత్తమం అని భావించారు. దీంతో సమాజానికి దూరంగా అడవుల్లోకి వెళ్లిపోయారు. అక్కడే చెట్ల మధ్య చిన్న ట్రీ హౌస్ ఏర్పాటు చేసుకుని కాపురం చేస్తున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని పుత్తూర్‌లో చోటుచేసుకుంది.
Samayam Telugu Photo by: Times Now
Photo by: Times Now


వివేక్ అల్లవా అనే వ్యక్తి గత వారం రోజులుగా తన కుటుంబంతో కలిసి అడవిలోనే ఉంటున్నాడు. తన ఇంటికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ట్రీ హౌస్ నిర్మించాడు. దానిపైకి ఎక్కేందుకు ఓ నిచ్చెన కూడా తయారు చేశాడు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. ‘‘సామాజిక దూరాన్ని పాటించడానికి ఇదే మంచి మార్గమని భావించాను. గత వారం రోజుల నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడికి ఎవరూ రావడం లేదు. ఇళ్లల్లో ఉండేవారు బయటకు రాకపోవడమే ఉత్తమం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంతకంటే మంచి మార్గం లేదు’’ అని తెలిపాడు.

ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓ లాయర్ ఈ విధంగానే చెట్టుపై నివసిస్తున్నాడు. హపూర్‌లోని అసురా గ్రామంలో నివసిస్తున్న ముకుల్ త్యాగీ సామాజిక దూరం పాటించేందుకు ఓ చెట్టుపై తాత్కాలిక విడిది ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబాన్ని కూడా కలవకుండా ఒంటరిగా ఆ చెట్టు మీదే నివసిస్తున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.