యాప్నగరం

షాకింగ్ వీడియో: కాలింగ్ బెల్ కొడితే.. పాము కాటేసింది!

ఆ వ్యక్తి కాలింగ్ బెల్‌ను అలా కొట్టాడో లేదో.. ఓ పాము ఊహించని విధంగా ఒక్కసారిగా పడగ విప్పి అతడి తలపై కాటు వేసి షాకిచ్చింది.

Samayam Telugu 8 May 2019, 7:07 pm
వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టాడు. అంతే.. వెంటనే ఓ పాము అతన్ని కాటువేసింది. ఈ ఘటన ఓక్లహోమాలోని లాటన్‌లో చోటుచేసుకుంది. జెరల్ హేవుడ్ అనే వ్యక్తి తన స్నేహితుడు రాడ్నే ఇంటికి వెళ్లాడు. కాలింగ్ బెల్ కొడుతుండగా.. డోరుకు వేలాడుతున్న పాము అకస్మాత్తుగా హేవుడ్ నుదుటి మీద కాటు వేసింది.
Samayam Telugu Lawton-OK-man-bitten-by-snake-answering-front-door


దీంతో షాకైన హేవుడ్ ఒక్క క్షణం వెనక్కి వెళ్లి.. ఇంట్లోకి వెళ్లిపోయాడు. ‘‘నన్ను వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లండి. నన్ను పాము కరిచింది’’ అంటూ రాడ్నే కుటుంబికులను వేడుకున్నాడు. సీసీటీవీ కెమేరాలో రికార్డయిన ఈ వీడియోను రాడ్నే కుమారుడు మషావన్ ‘ఫేస్‌బుక్‌’లో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం హేవుడ్ కోలుకుంటున్నాడని అతడు తెలిపాడు.
వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.