యాప్నగరం

వీడియో: డ్రైవింగ్ చేస్తుండగా.. పాము దాడి, రక్తంతో.. 100 కిమీల వేగంతో..

ఓ వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండగా ఒక్కసారి పాము దాడి చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Samayam Telugu 7 Jul 2020, 9:27 pm
హైవేపై ఓ వ్యక్తి గంటకు 100 కిమీలకు పైగా వేగంతో వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దీంతో పోలీసులు అతడిని వెంబడించారు. మధ్యదారిలో ఆపి.. ‘‘ఈ హైవే మీద అంత వేగంగా వెళ్లకూడదు. నువ్వు నిబంధన అతిక్రమించావు’’ అని పోలీసులు జరిమానా విధించబోయారు. అయితే, అతడు కంగారుగా ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అతడి చేతులు వణికిపోతున్నాయి. కారులో అక్కడక్కడ రక్తం మరకలు కనిపించాయి. దీంతో పోలీసులు అసలు కారణం అడిగారు.
Samayam Telugu Image: Facebook


తాను డ్రైవింగ్ చేస్తుండగా గోదుమ రంగులో ఉన్న పాము ఒకటి దాడి చేసిందని చెప్పాడు. ఆత్మరక్షణ కోసం సీటు బెల్టు, కత్తి సాయంతో దాన్ని చంపేశానని తెలిపాడు. తన చేతికి ఉన్న రక్తం పాముదేనని అన్నాడు. అది కాటేసిందనే భయంతో హాస్పిటల్‌కు వెళ్లేందుకు వేగంగా వాహనం నడిపానని చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని క్షమించి అంబులెన్సుకు ఫోన్ చేశారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ హైవేపై చోటుచేసుకుంది.

Also Read: లిఫ్ట్ ఇస్తాడు, హత్యచేసి.. శవాలతో సంభోగం, తల్లినీ వదలని కామాంధుడు!

బాధితుడి పేరు జిమ్మీ అని, అతడిపై దాడి చేసిన పాము చాలా విషపూరితమైనదని పోలీసులు తెలిపారు. లక్కీగా ఆ పాము అతడిని కాటేయలేదన్నారు. పాము దాడి వల్ల అతడు వణికిపోయాడన్నారు. అతడు చంపిన పామును ట్రక్కు వెనకాలే పెట్టాడని, అది కత్తిగాటుకు చనిపోయి ఉందని పోలీసులు తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీడియో:

Also Read: మిస్సైన ఆ విమానం 35 ఏళ్ల తర్వాత.. 92 అస్థిపంజరాలతో ల్యాండైంది!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.