యాప్నగరం

video: మరుక్షణంలో మృత్యుపాశం.. మెరుపులా వచ్చి పాపను కాపాడాడు

మృత్యువు మా చెడ్డది. అది ఎప్పుడు ఎటు నుంచి వద్దామా అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఏమాత్రం అలక్ష్యంగా ఉన్నా... మృత్యుపాశానికి బలయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా రోడ్లపై ఈ రోజుల్లో వాహనదారులు అతి వేగంతో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరి బిజీ వాళ్లది. అందువల్ల పిల్లలు రోడ్డు దాటేటప్పుడు, రోడ్డు పక్కన నడిచేటప్పుడూ జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో హెచ్చరిస్తోంది. మరి ఆ పాపను అతను ఎలా కాపాడాడో, మృత్యువుకి ఎలా ఝలక్ ఇచ్చాడో చూద్దాం.

Samayam Telugu 22 Feb 2022, 12:09 pm
రోడ్డు ప్రమాదాలు చెప్పి రావు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే దానికి చేసేదేమీ ఉండదు. చేజేతులా ప్రమాదం ఉచ్చులోకి వెళ్లడం మాత్రం కరెక్టు కాదు. చిన్నపిల్లలకు రోడ్లపై ఎలా నడవాలో, ఎలా వ్యవహరించాలో తెలియదు. అప్పటిదాకా సైలెంటుగా ఉంటారు. ఒక్కసారిగా రోడ్డుపైకి వెళ్లిపోతారు. వాళ్లను కంటిన్యూగా కనిపెట్టుకుంటూ ఉండటం వీలు కాని తల్లిదండ్రులకు ఆ క్షణం టెన్షన్ టెన్షన్. అంతలోనే ప్రమాదం జరిగితే ఆ పేరెంట్స్ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. తాజా వీడియోలో అలాంటి ఘటనే జరిగేది. లక్కీగా ఓ వ్యక్తి ఆ చిన్నారిని కాపాడటం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. (Man saves child from truck)
Samayam Telugu మరుక్షణంలో మృత్యుపాశం.. మెరుపులా వచ్చి పాపను కాపాడాడు (image credit - reddit - handlewithcareme)


రెడ్డిట్ లోని handlewithcareme యూజర్ ఈ వీడియోని ఫిబ్రవరి 21న పోస్ట్ చేశారు. ఇందులో ఓ రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అలాంటి చోట ఓ చిన్న పాప రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ పరుగులు పెట్టింది. సరిగ్గా అప్పుడే ఓ భారీ లాజిస్టిక్స్ ట్రక్ అటుగా వస్తోంది. దాన్ని ఆ పాప గమనించలేదు. ఆ ట్రక్ ని గుర్తించిన ఓ వ్యక్తి మెరుపులా పాప దగ్గరకు వెళ్లి చిన్నారిని వెనక్కి లాగేశాడు. అతను అలా చెయ్యకపోయి ఉంటే... ట్రక్ కింద చిన్నారి పడే ప్రమాదం ఉంటేది. అతను అంతవేగంగా స్పందించడం వల్లే పాపకు ఏమీ కాలేదు. మరోవైపు ట్రక్ డ్రైవర్ కూడా అంత వేగంగా వస్తూ కూడా... సడెన్ బ్రేక్ వెయ్యగాలిగాడు. (truck accident video)

ఆ వీడియోని ఇక్కడ చూడండి. (viral video)

పాపను కాపాడిన వ్యక్తి క్విక్ యాక్షన్ చూసి నెటిజన్లు ఇంప్రెస్ అవుతున్నారు. అతన్ని మెచ్చుకుంటున్నారు. కామెంట్స్ సెక్షన్‌లో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే ట్రక్ డ్రైవర్‌ని కూడా మెచ్చుకుంటున్నారు. "వామ్మో.. చాలా క్లోజ్ గా వెళ్లింది. గ్రేట్. బాగా కాపాడాడు. మంచి వాడు" అని ఓ యూజర్ కామెంట్ ఇచ్చారు. "బైక్ పై వచ్చిన వ్యక్తి కూడా సడెన్ బ్రేక్ వేయడం గొప్ప పని" అని ఓ యూజర్ స్పందించగా... "ఆ ట్రక్ డ్రైవర్ వేగంగా స్పందించాడు. ట్రక్ బ్రేక్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు.

ఇలాంటిదే ఇదివరకు ఓ ఘటన జరిగింది. అందులో కూడా ఓ పాప రోడ్డు దాటి వెళ్లింది. తిరిగి వెనక్కి రాబోతున్న సమయంలో... అటుగా ఓ కారు రావడాన్ని పాప అన్నయ్య గుర్తించాడు. వెంటనే మెరుపులా రోడ్డుపైకి వెళ్లి పాపను పట్టుకొని... రోడ్డుకి అటువైపుకి తీసుకెళ్లాడు. దాంతో పాప ప్రాణాలు దక్కాయి. (girl crossing road video)

ఆ వీడియోని ఇక్కడ చూడండి (teenager saves his sister)

video: అపార్ట్‌మెంట్‌లో మంటలు.. పిల్లల్ని కాపాడిన కుర్రాడిపై ప్రశంసలు
ఇలా పిల్లలు చూసీ-చూడకుండా రోడ్లు దాటుతూ తమ ప్రాణాలను రిస్కులో పెట్టడమే కాదు... పెద్దలకూ హార్ట్ ఎటాక్ తెప్పిస్తూ ఉంటారు. రోడ్లపై ఎలా మెలగాలో జాగ్రత్తలు నేర్పాలని ఈ వీడియోలు హెచ్చరిస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.