యాప్నగరం

సింహానికి ఆహారంగా ఎలక్ట్రీషియన్.. కూలీ అడిగినందుకు శిక్ష!

దారుణం.. కూలి డబ్బులు అడిగినందుకు పెంపుడు సింహాన్ని ఎలక్ట్రీషియన్‌పైకి వదిలిన యజమాని. పాకిస్థాన్‌లో అరాచకం.

Samayam Telugu 14 Oct 2019, 3:19 pm
ఎలక్ట్రీషియన్ తనకు రావల్సిన కూలి డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి దారుణంగా ప్రవర్తించాడు. బోనులో ఉన్న సింహాన్ని వదిలి.. అతడిని చంపాలని చూశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. లాహోర్‌లో నివసిస్తున్న ఆలి రాజా ఓ సింహాన్ని ఇంట్లోనే పెంచుకుంటున్నాడు.
Samayam Telugu GettyImages-157038508


ఇటీవల ఎలక్ట్రీషియన్ మహమ్మద్ రఫీక్‌ను ఇంటికి పిలిచి కొన్ని పనులు చేయించుకున్నాడు. డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి పంపేశాడు. ఎన్ని రోజులైనా ఆలి డబ్బులు ఇవ్వకపోవడంతో రఫీక్ విసుగుపోయాడు.

Read also: బెంగాలీ ఫస్ట్‌నైట్.. ‘కాళరాత్రి’ పేరుతో తొలిరాత్రి, కొత్త జంటను వేరుచేసే వింత ఆచారం

సెప్టెంబరు 9న రఫీక్ మరోసారి ఆలీ ఇంటికి వెళ్లి తన డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. దీంతో ఆలీ అతని ఇంట్లోని సింహాన్ని అతడిపైకి విడిచిపెట్టాడు. అది రఫీక్‌ను చంపేందుకు ప్రయత్నిస్తున్నా ఆలీ స్పందించలేదు. రఫీక్ అరుపులు విని స్థానికులు అక్కడికి చేరడంతో ఆలీ సింహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లాడు. రఫిక్‌ను ఆసుపత్రిలో చేర్చాడు.

Read also: దేశమంతా తిప్పుతూ.. బాలికపై 500 మందికిపైగా అత్యాచారం!

కూలీ డబ్బులతోపాటు వైద్యానికి అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని చెప్పడంతో రఫీక్.. ఆలీపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆలీ ఇచ్చిన మాట తప్పడంతో రఫీక్ శనివారం పోలీసులను ఆశ్రయించాడు. డబ్బులు అడిగినందుకు ఆలీ తన సింహంతో చంపించి.. ఆహారంగా పెట్టాలని చూశాడని తెలిపాడు. పోలీసులు ఆలీపై హత్యాయత్నం కేసు నమోదు చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.