యాప్నగరం

ఫన్నీ వీడియో: దురద వీరుడు.. జేసీబీతో వీపు గోకించుకున్నాడు, నవ్వులే నవ్వులు!

ఈ పెద్దాయనకు వీపు బాగా దురద పెట్టింది. దీంతో జేసీబీ ముందుకు వెళ్లి వంగున్నాడు. అక్కడ ఉన్నవారికి అతడు ఏం చేస్తున్నాడో ముందు అర్థం కాలేదు. అయితే, జేసీబీతో అతడు వీపు గోకించుకోవడం చూసి అక్కడ నవ్వులు విరిశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.

Samayam Telugu 15 Oct 2020, 6:23 pm
మీకు దురద పెడితే ఏం చేస్తారు?... ‘‘అదేం ప్రశ్నా? దురద పెడితే గోక్కుంటాం’’ అనేగా మీ సమాధానం. బాగా దురద పెడితే చేతులతో గోక్కుంటాం లేదా చేతికి అందుబాటులో ఉండే దువ్వెన, కర్రలు.. ఇలా చేతికి ఏది అందితే వాటితో గోకేసుకుంటాం. అయితే, ఇతడికి వచ్చినది సాధారణ దురద కాదు. చిన్నచిన్న వస్తువులతో తీరని దురద. అందుకే.. అతడు ఏకంగా జేసీబీతో గోకించుకున్నాడు. ఓమైగాడ్.. జేసీబీతో వీపు గోకించుకున్నాడా? అని ఆశ్చర్యపోతున్నారా? ఔనండి, మీరు విన్నది నిజమే. ఇందుకు ఈ వీడియోనే నిదర్శనం.
Samayam Telugu Image Credit: ABDUL NASAR/Facebook


Read Also: శంభళ నగరం ఎక్కడుంది? కల్కీ అక్కడే పుట్టారా?.. ఈ అద్భుత లోకం ఓ అంతుచిక్కని మిస్టరీ!

ఈ ఫన్నీ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తవ్వకాల పనుల్లో పాల్గొన్న ఓ కూలీకి వీపు బాగా దురద పెట్టినట్లుంది. వెంటనే జేసీబీ ఆపరేటర్‌ను రిక్వెస్ట్ చేసుకున్నాడు. దేనితో గోక్కున్నా దురద పోవడం లేదని చెప్పాడు. జేసీబీతో తన వీపు గోకాలని అడిగాడు. మొత్తానికి ఇలా తన కోరిక తీర్చుకున్నాడు. జేసీబీ ముందు వినయంగా వంగుని.. దాని పదునైన ఇనుప పళ్లతో గోకించుకున్నాడు. ఆ తర్వాత చిలిపిగా.. వీపు మాత్రమేనా? ఇంకా ఏమైనా గోకాలా అన్నట్లుగా.. జేసీబీని ఆ పెద్దాయన పొట్టదగ్గర పెట్టాడు. దీంతో అతడు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అబ్దుల్ నసర్ అనే వ్యక్తి ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఈ ఫన్నీ వీడియో చూస్తే మీరు కూడా నవ్వేసుకుంటారు. (గమనిక: కింది వీడియో ఓపెన్ కానట్లయితే.. ఇక్కడ క్లిక్ చేయండి).undefined
Read Also: నగ్నంగా ప్రపంచాన్ని చుట్టేస్తున్న జంట.. ఫొటోలు వైరల్

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.