యాప్నగరం

బిగ్‌బాస్ చూపించి బ్రెయిన్ ఆపరేషన్.. వినడానికి వింతగా ఉన్నా నిజమే!

ఒక రోగికి బిగ్ బాస్ చూపిస్తూ మెదడు ఆపరేషన్ చేసిన సంఘటన గుంటూరులో జరిగింది. ఈ ఆపరేషన్ జరుగుతున్నంత సేపూ అతను బిగ్ బాస్, అవతార్ సినిమాలు చూస్తూనే ఉన్నాడు.

Samayam Telugu 23 Nov 2020, 8:06 pm
సాధారణంగా ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్‌కు అనస్తీషియా ఇస్తారని మనకు తెలుసు. కానీ బిగ్ బాస్ షో చూపిస్తూ ఆపరేషన్ చేసేసిన సంగతి మీరు ఎప్పుడైన విన్నారా? ఈ అరుదైన, ఆశ్చర్యకరమైన సంఘటన గుంటూరులో జరిగింది.
Samayam Telugu Brain Surgery


వరప్రసాద్(33) అనే రోగికి ల్యాప్‌టాప్‌లో బిగ్ బాస్, అవతార్ సినిమాలు చూపిస్తూ డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేసేశారు. వినడానికే వింతగా ఉంది కదూ! ఇండియా టుడ్ సంస్థ కథనం ప్రకారం ఈ సంఘటన గుంటూరులోని బృందా హాస్పిటల్లో జరిగింది.

Also Read: అతి చెత్త డ్రైవింగ్.. ఎస్‌యూవీని గుద్ది, మరో కారుపై పడిన కారు.. నడిపింది అమ్మాయా?!

ఈ ఆపరేషన్‌ను ముగ్గురు వైద్యుల బృందం నిర్వహించింది. అతని మెదడులో ఎడమవైపు ఉన్న ప్రీమోటర్ ఏరియాలో ఉన్న గ్లికోమాను తొలగించడానికి ఈ సర్జరీ నిర్వహించారు. అయితే ఈ సర్జరీ జరుగుతున్నంత సేపు అతను బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాలు చూస్తూనే ఉన్నాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఒక మహిళ వయొలిన్ వాయిస్తూ ఉండగానే.. అత్యంత క్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని చేశారు. డాగ్మర్ టర్నర్ అనే ప్రొఫెషనల్ వయొలనిస్ట్ బ్రెయిన్‌లో ట్యూమర్ ఏర్పడింది. దీనికి సంబంధించిన ఆపరేషన్ జరిగేటప్పుడు ఆమె వయొలిన్ వాయిస్తూనే ఉంది.

వైట్ సింఫనీ ఆర్కెస్ట్రాలో టర్నర్ వయొలిన్ వాయిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం జనవరి 31వ తేదీన ఆమెకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఈ ప్రక్రియ జరిగేటప్పుడు ఆమె అనస్తీషియా నుంచి బయటకు వచ్చి వయొలిన్ వాయించింది.

Also Read: పేడతో కొట్టుకున్న గ్రామస్తులు.. ఊరంత కంపు కంపు, కారణం ఇదే..

అయితే ఆమె వయొలిన్ వాయిస్తున్నప్పటికీ ఈ ఆపరేషన్‌ను ఆ డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. ఈ విషయాన్ని కింగ్స్ కాలేజ్ హాస్పటల్ వారు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.