యాప్నగరం

నది అడుగున కారు.. అందులో శవం.. 12 ఏళ్ల మిస్టరీ ఇలా వీడింది!

నదిని శుభ్రం చేసేందుకు 72 అడుగులు కిందకు చేరిన డైవర్లకు అక్కడ ఓ కారు కనిపించింది. అందులో ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడు. దీంతో వెంటనే పోలీసులకు ఈ సమాచారం అందించి.. కారును వెలికి తీశారు.

Samayam Telugu 19 Mar 2021, 12:41 pm
Orengon: ఓ వ్యక్తి 12 ఏళ్లుగా కనిపించడం లేదు. అతడి కోసం కుటుంబికులు ఎంతో కలవరపడ్డారు. పోలీసులు సైతం అతడి గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో చేతులెత్తేశారు. ఇది జరిగి సుమారు 12 ఏళ్లు అవుతోంది. అయితే, ఊహించని విధంగా మిస్టరీ వీడింది. కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి ఆచూకీ లభించింది. అతడు ప్రయాణించిన కారు ఓ నదిలో కనిపించింది. అందులోనే అతడి శవం కూడా ఉంది.
Samayam Telugu Image Credit: Adventures with Purpose/YouTube


నదిని శుభ్రం చేస్తుంటే..: ‘అడ్వాంచెర్స్ విత్ పర్పస్’ అనే యూట్యూబ్ చానెల్ నిర్వాహకులు పర్యవరణ పరిరక్షణ కోసం సాహసాలు చేస్తుంటారు. వీరు చేసే ప్రతి కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేస్తుంటారు. ఇందులో భాగంగా అమెరికాలోని ఒరెగాన్‌లో గల విల్లమెట్టే నదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా నది అడుగున ఉండే వ్యర్థాలను తొలగించేందుకు డైవింగ్ చేశారు.

నదిలో 72 అడుగుల కిందకు చేరిన తర్వాత పెద్ద వస్తువు ఏదో కనిపించింది. దగ్గరకు వెళ్లి చూడగా అది కారు. నాచు పట్టేసిన అద్దాలను తుడిచి చూస్తే.. లోపల శవం కనిపించింది. వెంటనే వారు నది నుంచి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల అనుమతితో ఆ కారును బయటకు తీశారు. కారు నెంబరు ఆధారంగా పోలీసులు అందులో ఉన్న శవాన్ని గుర్తించారు.

Read Also: సీఎంపై నిరసన.. చిరిగిన జీన్స్ ఫ్యాంట్ ఫొటోలతో మహిళలు రచ్చ, ఇవిగో సిత్రాలు!

అతడు ఒరెగాన్‌కు చెందిన టిమోతీ ఎడ్వర్డ్ రాబిన్సన్(56) అని తెలిసింది. 2008, నవంబరు 26న తన సిల్వర్ కలర్ మజ్దా సీడన్ కారులో బయటకు బయల్దేరాడు. ఆ తర్వాత మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. అప్పటి నుంచి పోలీసులు అతడి కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. దీంతో అతడిని ఎవరైనా హత్య చేశారా? లేదా ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అనేది మిస్టరీగా మారింది.
ఓర్ని.. ‘అక్కడ’ కొక్కెం తగిలించుకుని బంగీ జంప్.. ఉందా? ఊడిందా?ఎట్టకేలకు ఆ యూట్యూబ్ చానెల్ లైవ్ వల్ల అతడి ఆచూకీ తెలిసింది. దీంతో టిమోతీ కుటుంబికులు ఆ యూట్యూబ్ చానెల్‌కు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఎన్నాళ్లు అతడు ఏమయ్యాడో తెలియక అయోమయంలో ఉన్నామని తెలిపారు. ఏదో ఒక రోజు ఇంటికి తిరిగివస్తాడని ఎదురుచూశామని, కానీ ఈ విధంగా అతడిని చూడాల్సి వస్తుందని అనుకోలేదని విలపించారు. నది అడుగున ఉన్న కారును వెలికి తీస్తున్న దృశ్యాన్ని ఈ కింది వీడియోలో చూడండి.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.